Home » పదహారేళ్లైనా – కరెంట్ తీగ

పదహారేళ్లైనా – కరెంట్ తీగ

by Rahila SK
0 comment

పాట: పదహారేళ్లైనా
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
గాయకులు: చిన్మయి శ్రీపాద
చిత్రం: కరెంట్ తీగ (2014)
తారాగణం: మనోజ్ మంచు, రకుల్ ప్రీత్ సింగ్
సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి


పదహారేళ్లైనా పసి పాపై ఉన్న
నీ వెచ్చని చూపే తగిలేదాకా
పరువం లో ఉన్న పరవాలేదన్న
నీ కల నా వైపే కదిలే దాకా
అరేయ్ ఏమైందో ఏమైందో సరిగ్గా
ఏమైందో నే మొదట నిన్ను కలిసినక
నాలో ఏం జరిగిందో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీల మార్చిందయ్యో

తెలుగు ఏ కాకుండా చాలా బాషల్లోనా
వెతికా ఈ జబ్బుని ఏమంటారో
తెలిపే వాళ్లెవరు లేరే ఈ లోకాన
నువ్వే చెప్పాలది అది నీవల్లే రో
ఎన్నో చేసి చేసి ఎంతో సన్న బడిన
బరువే తగ్గదు ఈ గుండెల్లోనా
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీల మార్చిందయ్యో

చదువేం అవుతుందని గుబులైన రాదేంటో
నిన్నే చదవాలని ఆరాటంలో
రేపేమవుతుందని దిగులైన రాదేంటో
నిన్నని మరిపించే ఆనందంలో
చుట్టూ ఉన్న వాళ్ళు తిట్టే కన్నా వాళ్ళు
ఎవరు గుర్తు రారు ని తలపుల్లో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
అంటూ అంత మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏం మాయో
నన్నే నీల మార్చిందయ్యో

You may also like

Leave a Comment