Home » అధర్మాన్ని అణిచేయ్యగ(Theme of Kalki) సాంగ్ లిరిక్స్ – కల్కి 2898 ఏడీ

అధర్మాన్ని అణిచేయ్యగ(Theme of Kalki) సాంగ్ లిరిక్స్ – కల్కి 2898 ఏడీ

by Vinod G
0 comments

అధర్మాన్ని అణిచేయ్యగ

యుగయుగాన.. జగములోన

పరిపరి విధాల్లోన విభవించే.. విక్రమ విరాట్రూపమితడే

స్వధర్మాన్ని పరిరక్షించగ

సమస్తాన్ని ప్రక్షాళించగ

సముద్భవించే అవతారమిదే..

మీనమై.. పిదప కూర్మమై

తను వరాహమై.. మనకు సాయమై

బాణమై.. కరకు ఖడ్గమై

చురుకు ఘూతమై.. మనకు ఊతమై

నిశి తొలిచాడు దీపమై

నిధనం తన ధ్యేయమై

వాయువే.. వేగమై

కలియుగ స్థితిలయలే కలబోసే కల్కి ఇతడే

స్వధర్మాన్ని పరిరక్షించగ

సమస్తాన్ని ప్రక్షాళించగ

సముద్భవించే అవతారమిదే..

ప్రార్థనో.. మధుర కీర్తనో

హృదయ వేదనో.. మన నివేదనం

అందితే.. మనవి తక్షణం

మనకు సంభవం.. అతడి వైభవం

అధర్మాన్ని అణిచేయ్యగ

యుగయుగాన జగములోన

పరిపరి విధాల్లోన.. విభవించే విక్రమ విరాట్రూపమితడే

స్వధార్మాన్ని పరిరక్షించగ

సమస్తాన్ని ప్రక్షాళించగ

సముద్భవించే అవతారమిదే


చిత్రం: కల్కి 2898 ఏడీ
గాయకులు: కాల భైరవ, అనంతు, గౌతమ్ భరద్వాజ్, కోరస్
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: సంతోష్ నారాయణన్
దర్శకుడు: నాగ్ అశ్విన్
తారాగణం: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ మరియు ఇతరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment