Home » రైతులు పురుగు మందులు కొనేటప్పుడు ఇవి తప్పక గుర్తించుకోండి…

రైతులు పురుగు మందులు కొనేటప్పుడు ఇవి తప్పక గుర్తించుకోండి…

by Vinod G
0 comments
tips for buying pesticides

పంటల్లో చీడపీడల నివారణ కోసం రైతులు ఎక్కువగా పురుగు ముందులను వినియోగిస్తుంటారు. అయితే వీటిని కొనుగోలు చేసే సమయంలో కొన్నిసూచనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే తెగుళ్లను, చీడపీడలను సమర్ధవంతంగా కట్టడి చేయవచ్చుని అంటున్నారు. ఇప్పుడు ఆ సూచనలు ఏంటో చూద్దాం.

  • ఒకే మందు పొడి మందుగాను లేదా నీటిలో కరిగే ద్రావణంగాను ఇంకా గుళికల రూపంలో లభ్యమౌతున్నప్పుడు మనం ఎన్నుకునే విధానం అనేది ఆశించిన పురుగుబట్టి లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఉండాలి.
  • పొడి మందులు ఎక్కువగా గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగ్గా కలియబెట్టనప్పుడు స్ప్రేయర్ నాజిల్స్ లో చేరి సరిగా పనిచేయవు.
  • నాసిరకం మందుల ఫార్ములేషన్లు ఎక్కువగా చర్మంలో నుంచి శరీరంలో ప్రవేశించే గుణం కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటి మేతాదు పెరిగినప్పడు పుంటలఫై విష ప్రభావం చూపించగలవు.
  • సస్యరక్షణ మందుల గుణగణాలపై అవగాహనా ఉన్న నమ్మకస్థులైన డీలర్ల దగ్గర మాత్రమే మందులు కొనుగోలు చేయాలి.
  • ఆశించినది తెగులో, పురుగో గుర్తించి దగ్గరలోని వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు సస్యరక్షణ మందులను కొనుగోలు చేయాలి.
  • కొన్న మందు వివరాలను పొందుపరిచిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి.
  • రెండు మూడు మందులు అందుబాటులో ఉండి, ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ మందు విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. మందు ప్యాకింగ్ పై త్రిభుజాకారంలో వివిధ రంగుల ద్వారా విషపూరిత గుణాన్ని తెలియజేస్తారు.
  • ఎరుపు రంగు త్రిభుజం ఉంటే అత్యధిక విషపూరితం, పసుపు రంగు త్రిభుజం ఉంటే అధిక విషపూరితం, నీలం రంగు త్రిభుజం ఉంటే మోస్తరు విషపూరితం.
  • ఆకుపచ్చరంగు త్రిభుజం ఉంటే కొద్దిపాటి విషపూరితం అని గుర్తించాలి.
  • లేబుల్ క్లైమ్ ను బట్టి మందును ఎన్నుకోవాలి. అంటే ఆ పంటపై ఏ పురుగుకు, ఏ తెగులుకు సిఫార్సు చేశారో అదే మందును వాడాలి.
  • సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో విషప్రభవం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులను వాడాలి.
  • కొనేముందు పురుగుల మందు డబ్బా/ప్యాకెట్ ప్యాకింగ్, గడువు తేదీని చూసి తీసుకోవాలి.

ఇలాంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వ్యవసాయం ను సంప్రదించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.