Home » 12 ఏళ్ల తర్వాత పిక్కపాటి గ్రామం కొండపైన విరబూసిన “నీలకురింజి ” పుష్పాలు

12 ఏళ్ల తర్వాత పిక్కపాటి గ్రామం కొండపైన విరబూసిన “నీలకురింజి ” పుష్పాలు

by Rahila SK
388 views
after 12 years neelakurinji flowers blossomed on the hill of pickapati village

తమిళనాడు నీలగిరి జిల్లాలోని పిక్కపాటి సమీపంలోని గిరిజన గ్రామాలను ఆనుకుని ఉన్న కొండలపై నీలకురింజి పూలు విరగబూశాయి. ఈ అందమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నీలకురింజి పూలు నీలం రంగులో ఉంటాయి, మరియు ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనేను వ్యాపారులు “ద్రవ బంగారం”గా భావిస్తారు.

12 ఏళ్ల తర్వాత పక్క పాడు గ్రామం కొండపైన విరబూసిన “నీలకురింజి” పుష్పాలు ప్రకృతి అందాల రహస్యాన్ని మరల తెరపైకి తీసుకొచ్చాయి. ఈ నీలకురింజి పూలు ప్రత్యేకత ఏమిటంటే, అవి చాలా అరుదుగా మాత్రమే వికసిస్తాయి. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇవి పుష్పించటం జరుగుతుంది. ఈ పూల రంగు నీలం కలిగినట్లు ఉంటుందని, వాటి అందం చూసేందుకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో పుష్పించినప్పుడు ఆ ప్రదేశం ఒక అందమైన నీలి రంగు పచ్చిక బయలుగా మారుతుంది. ఆ పూలు పోయిన తర్వాత ఆ మొక్క పూర్తిగా ఎండిపోతుంది. ఆ మొక్క నుంచి రాలిన విత్తనాల నుంచి మళ్లీ కొత్త మొక్కలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా 240 రకాల కురింజి మొక్కలు ఉన్నాయని మరియు వాటిలో 46 జాతులు భారతదేశంలో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన పూలను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు, మరియు ఇది ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన అనుభవం అందిస్తోంది.

ఇలాంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వ్యవసాయం ను సంప్రదించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.