Home » నేరుగా OTT లోకి వస్తున్న సుమంత్ ‘అహం రీబూట్’

నేరుగా OTT లోకి వస్తున్న సుమంత్ ‘అహం రీబూట్’

by Vinod G
0 comments
aham reboot ott update

అక్కినేని సుమంత్ హీరోగా తెరెకెక్కిన ‘అహం రీబూట్’ నేరుగా OTT లోకి వచ్చేస్తుందండోయ్. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ని థియేటర్ లో విడుదల చేయాలని మొదట భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా నేరుగా OTT లోకి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆహా OTT వేదికలో జూన్ 30(2024) తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.

సైక్లాజికల్ త్రిల్లర్ గా అహం రీబూట్ తెరెక్కించారు. అనుకోని సంఘటనలు మనిషిలోని కొత్త కోణాల్ని, శక్తులను బయటకు తెస్తాయి. అలాంటి అంశాలతో ఈ కథను తెరెక్కించారు. సుమంత్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని డైరెక్టర్ తెలియచేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ సాగర్ దర్శకత్వం వహించగా, రఘువీర్ గోరిపర్తి, సృజన్ యర్రబోలు సంయుక్తంగా నిర్మించారు.

కథ గురించి…

స్టూడియోలో ఉన్న ఆర్ జె నిలయ్(సుమంత్ )కు ఓ అమ్మాయి నుండి సాయం కావాలంటూ ఫోన్ వస్తుంది. తాను కిడ్నప్ అయ్యానని ఆ అమ్మాయి చెప్తుంది. మరి ఆ యువతిని ఎవరు కిడ్నప్ చేశారు? ఎందుకు చేశారు? ఎలా బయట పడింది? అందుకు ఆర్ జె నిలయ్ ఏమి చేసాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే మరి సినిమా చూడాలసిందే..

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ OTT ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.