Home » ప్ర‌భాస్ క‌ల్కి మూవీ రిలీజ్ – ఓటీటీలోనే ఎపుడో తెలుసా!

ప్ర‌భాస్ క‌ల్కి మూవీ రిలీజ్ – ఓటీటీలోనే ఎపుడో తెలుసా!

by Vishnu Veera
0 comment

ముందుగా తెలుగు రీడర్స్ కి స్వాగతం.

క‌ల్కి మూవీ (జూన్ 27న) వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పురాణాల‌కు గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్ హంగుల‌ను జోడించి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ క‌ల్కి మూవీని తెర‌కెక్కించాడు. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ మూవీలో క‌మ‌ల్ హాస‌న్ విల‌న్‌గా క‌నిపించ‌గా అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకోణ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.
దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే దాదాపు న‌ల‌భై కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టింది. తొలిరోజు క‌ల్కి మూవీ వంద కోట్ల‌కుపైనే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. క‌ల్కి డిజిట‌ల్ స్ట్రీమింగ్ అమెజాన్‌లోనే అని టైటిల్ కార్డ్స్‌లో చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కాగా క‌ల్కి మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది.
భారీ పోటీ మ‌ధ్య దాదాపు 150 కోట్ల‌కు ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. క‌ల్కి మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది వారాల త‌ర్వాతే ఓటీటీ రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
ఆగ‌స్ట్ నెలాఖ‌రున క‌ల్కి మూవీ ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. ఆగ‌స్ట్‌లోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.

మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు రీడర్స్ OTT ని సందర్శించండి.

You may also like

Leave a Comment