Home » బిగ్ బాస్ ఓ టీ టీ సీసన్ 3

బిగ్ బాస్ ఓ టీ టీ సీసన్ 3

by Rahila SK
0 comments

హాస్ట్ : అనిల్ కపూర్.

బిగ్ బాస్ రియాలిటీ షో టెలివిజన్ లో అయితే హిందీ 17 సీజన్స్ ను పూర్తి చేసుకుంది, మరియు తెలుగులో 7 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈ ఓటీటీ బిగ్ బాస్ మాత్రం రెండేళ్ల క్రిందటే మొదలై రెండు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడోవ సీజ‌న్‌కు సిద్ద‌మైంది. రెండో సీజ‌న్‌కు స‌ల్మాన్ ఖాన్ హోస్టుగా వ్య‌వ‌హ‌రించ‌గా మూడో సీజ‌న్‌కు న‌టుడు అనిల్ క‌పూర్ హోస్టుగా వ్యహరిస్తున్నారు. ఇప్పటివరకు అనిల్ కపూర్ ను కేవలం సినిమాలలో మాత్రమే చూసిన ప్రేక్షకులు ఇక ఇప్పుడు హోస్టుగా ఎలా వ్యవహరిస్తున్నారో అని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఫ‌స్ట్ కంటెస్టెంట్ ను కూడా రివీల్ శారు, ఈ ఫ‌స్ట్ కంటెస్టెంట్ స్టోరీ, ఓ చిన్న బండి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. ఈ ఫోటోల‌ను చూసిన నెటిజన్లు ఆమె ఫేమస్‌ వడాపావ్‌ గర్ల్‌ చంద్రిక అని అంటున్నారు. ఢిల్లీ వీధుల్లో వడాపావ్‌ అమ్ముతూ చంద్రిక ఫేమస్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో అంద‌రిని దృష్టిని ఆక‌ర్షించిన ఈ అమ్మాయి ఓటీటీలో ఎలా అల‌రిస్తుందో చూడాలి. ఇక హిందీ బిగ్‌ బాస్ ఓటీటీ మూడోవ సీజ‌న్ జూన్ 21 నుండి రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ ఓటీటీ మూడోవ సీజ‌న్ స్ట్రీమింగ్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి, జియో సినిమా లో ప్రారంభం కానుంది.

మరిన్ని ఇటువంటి OTT ఇన్ఫర్మేషన్ కోసంతెలుగు రీడర్స్ OTTని సందర్శించండి.

You may also like

Leave a Comment