Home » OTT లోకి మిగిలిన ఎపిసోడ్లు వచ్చేస్తున్నాయి.. తెలుగులో వెబ్ సిరీస్ ‘షోటైమ్’

OTT లోకి మిగిలిన ఎపిసోడ్లు వచ్చేస్తున్నాయి.. తెలుగులో వెబ్ సిరీస్ ‘షోటైమ్’

by Vinod G
0 comments

ఏంటి మిగిలిన ఎపిసోడ్లు వచ్చేస్తున్నాయి దేని గురించి అని అనుకుంటున్నారా, అదేనండి అప్పుడు శ్రీయ నటించిన షోటైమ్ వెబ్ సిరీస్ గురించి. మూడు నెలలు క్రిందట ఈ సిరీస్ లో మొదటి సీజన్లో నాలుగు ఎపిసోడ్లు వచాయి, ఆ తరువాత ఇప్పుడు మిగిలిన ఎపిసోడ్లు OTT లోకి రావడానికి సిద్ధంగా వున్నాయి. ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్ లో పవర్ కోసం తెర వెనుక జరిగే తతంగాన్ని మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు. ఈ షోటైమ్ మిగిలిన ఎపిసోడ్లు కూడా జులై 12(2024) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా హాట్‌స్టార్ వెల్లడించింది.

కరణ్ జోహార్ కు చెందిన ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్ ను తెరకెక్కించింది. ఇమ్రాన్ హష్మితోపాటు మహిమా మఖ్వానా, మౌనీ రాయ్, రాజీవ్ ఖండేల్వాల్, శ్రియ శరణ్, విజయ్ రాజ్ లాంటి వాళ్లు నటించారు. సుమిత్ రాయ్, మిహిర్ దేశాయ్ ఈ షోని క్రియేట్ చేశారు.

మొదటి సీసన్ లోని నాలుగు ఎపిసోడ్స్ కథ ఏంటి…

షోటైమ్ వెబ్ సిరీస్ తొలి నాలుగు ఎపిసోడ్లు ఇప్పటికే హాట్‌స్టార్ లో అందుబాటులో ఉన్నాయి. విక్టరీ స్టూడియోస్ కు చెందిన విక్టర్ ఖన్నా (నసీరుద్దీన్ షా) కన్ను మూసిన తర్వాత దానిని చేజిక్కించుకోవడానికి అన్నచెళ్లెళ్ల మధ్య జరిగే సమరాన్ని ఈ షోలో చూపించారు. విక్టర్ ఖన్నాకు తొలి భార్య ద్వారా రఘు ఖన్నా (ఇమ్రాన్ హష్మి) అనే ఒక కొడుకు ఉండగా.. రహస్యంగా మరో మహిళ ద్వారా మహికా నందీ (మహిమా మఖ్వానా) అనే మరో అమ్మాయి ఉంటుంది.

ఆమె తన తండ్రి విక్టర్ ఖన్నా అని తెలియక ఓ ఫిల్మ్ జర్నలిస్టుగా పని చేస్తూ ఉంటుంది. విక్టర్ ఖన్నా చనిపోయే ముందు అసలు నిజాన్ని ఆమెకు చెబుతాడు. అతడు కన్ను మూసిన తర్వాత విక్టరీ స్టూడియోస్ మహికా నందీ సొంతమవుతుంది. అది సహించలేని రఘు ఖన్నా పోటీగా మరో స్టూడియో పెడతాడు. ఈ అన్నచెళ్లెళ్ల మధ్య నడిచే ఈ వార్ రసవత్తరంగా ఉన్న సమయంలో తొలి నాలుగు ఎపిసోడ్లు ముగిశాయి.

ఇప్పుడు మిగిలిన ఎపిసోడ్లలో వీళ్లలో ఎవరు పైచేయి సాధించబోతున్నారు? విక్టరీ స్టూడియోస్ భవిష్యత్తు ఏంటి అన్నది తేలనుంది. ఈ సిరీస్ లో అర్మాన్ సింగ్ (రాజీవ్ ఖండేల్వాల్) అనే స్టార్ యాక్టర్ భార్య మందిరా సింగ్ పాత్రలో శ్రియ శరణ్ నటించింది. ఈ షోటైమ్ బాలీవుడ్ తెర వెనుక కథలను కళ్లకు కట్టేలా చూపించింది. దీంతో మిగిలిన ఎపిసోడ్ల కోసం మూడు నెలలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ OTT ను సందర్శించండి.

You may also like

Leave a Comment