Home » జులై 19న ఓటీటీలో కి ‘మహారాజ’ మూవీ

జులై 19న ఓటీటీలో కి ‘మహారాజ’ మూవీ

by Shalini D
0 comments
Movie maharja

తమిళ స్టార్‌ హీరో, విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఇటీవల నటించిన చిత్రం ‘మహారాజ’ . ఇది విజయ్‌ సేతుపతి 50వ చిత్రం కావడం విశేషం. ఇక జూన్‌ 14న థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జులై 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళం, తెలుగులో అందుబాటులోకి రానుందట.

‘మహారాజ’ కథ:
మహారాజ ఓ సామాన్య బార్బర్. తన కూతురితో కలిసి సిటీకి దూరంగా నివసిస్తుంటాడు. అయితే మహారాజ కూతురు జ్యోతి నెలల పసికందుగా ఉన్నప్పుడు అతడి భార్య ఓ ప్రమాదంలో మరణిస్తుంది. అయితే ఆ ప్రమాదంలో పాప మాత్రం ప్రాణాలతో బయటపడుతుంది. అయితే ఆమె ప్రాణాలతో ఉండటానికి కారణమైన చెత్త బుట్ట కారణం అవుతుంది. దాంతో అప్పటి నుంచి దానికి లక్ష్మి అని పేరు పెట్టి బాగా మహారాజాను కొంతమంది దొంగలు కొట్టి చెత్త బుట్టను తీసుకువెళతారు.

దాంతో తన కుమార్తె తిరిగి వచ్చేసరికి ఎలాగైనా లక్ష్మీని(చెత్త బుట్టను) వెతికి పెట్టమని పోలీసు ఫిర్యాదు చేస్తాడు. పోలీసు స్టేషన్‌కి వెళ్లిన మహారాజ పోలీసులతో చెత్త బుట్ట పోయిందని చెప్పేసరికి వారు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ చెత్త బుట్టలో ఏం దాచాడు? ఎలక్ట్రిక్ షాప్ యజమానిగా పగలు మంచివాడిగా నటిస్తున్న సెల్వ రాత్రుళ్లు దొంగతనాలు చేస్తూ ఉంటాడు.

అతడి ముఠాకు, మహారాజ ఇంటిలో లక్ష్మీకి దొంగలించడానికి సంబంధం ఏమైనా ఉందా? నిజంగా మహారాజ, లక్ష్మి కోసమే పోలీసుల దగ్గరకు వెళ్లాడా? మరే కారణమైన ఉందా? తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ OTT ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.