కొందరు మహిళలు ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో బాధపడూతూ ఉంటారు. ఇవి వారి ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి, ఇంకా వారికి చికాకును కూడా కలిగిస్తాయి. ఈ సమస్యను అధిగమించేందుకు వీరు వివిధ రకాల క్రీములను ఉపయోగిస్తారు. ఇవి సత్ఫಲಿతాలు ఇవ్వకపోగా కొన్నిసార్లు దుష్ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అయితే మనం ఇంట్లోనే దొరికే కొన్ని సహజ ఉత్పత్తులతో ముఖంపై వెంట్రుకలు తోలగించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం…
ఒక టీస్పూన్ పసుపును పెరుగుతో కలిపి పేస్ట్ లాగ చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముఖంపై వెంట్రుకలు పెరుగుదల తగ్గుతుంది.
బొప్పాయి పండును మెత్తగా చేసి అందులో ఒక టీ స్పూన్ పసుపు పోడి వేసి స్క్రబ్ లాగ తయారు చేసుకోవాಲಿ. దీన్ని మీ ముఖంపై సున్నితంగా మసాజ్ చేసి 15 నిమిషాల తర్వత ముఖం కడుక్కోవాలి. ఇది ముఖంపై జుట్టు కుదుళ్లను విచ్ఛన్నం చేసి మృదమైన మంచి చర్మాన్ని ఇస్తుంది.
కొంచెం శనగపిండిని పాలు లేదా నీళ్లతో కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాಲಿ. ఆతర్వత ముఖం కడుక్కోవాలి. దీని వల్ల డెడ్ స్కీన్ తొలగడమే కాకుండా ముఖంపై వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.