Home » మృదువైన గులాబీ రంగు పెదాల కోసం ఈ చిన్న పని చేయండి చాలు

మృదువైన గులాబీ రంగు పెదాల కోసం ఈ చిన్న పని చేయండి చాలు

by Nikitha Kavali
460 views
pink lips at home

మన మొహం మీద ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవి పెదాలు. పెదాలు ఎంత ఆర్షణీయంగా ఉంటాయో అవి అంత డెలికేట్ గా కూడాను ఉంటాయి. ఇప్పుడు బయట ఉన్న పొల్యూషన్ కారణంగా మన పెదాలు బాగా పాడైపోతున్నాయి.

దానివల్ల ఊరికే నల్లగా అవడం లేదా పొడిబారిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి కచ్చితంగా వాటి మీద శ్రాధ పెట్టాల్సిందే. ఇక్కడ ఉన్న ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు వరం రోజుల్లో మృదువైన గులాబీ రంగు పెదాలు మీ సొంతమైపోతాయి.

  1. అందుకోసం ముందుగా బీట్రూట్ ని తురిమి దాని రసాన్ని కొంచెం తీసి పక్కన పెట్టాలి.
  1. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అందులో రెండు టీ స్పూన్ల పంచదార, 1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను తీసుకొని బాగా కలపండి.
  1. ఇప్పుడు ఈ పంచదార ఆలివ్ ఆయిల్ మిశ్రమం లోకి బీట్రూట్ జ్యూస్ ను వేసి బాగా కలపండి. 

అంతేను అండి ఇక స్క్రబ్ ను వారం రోజుల పాటు రాత్రి పడుకొనే ముందు అప్లై చేసి ఒక 3 నిముషాలు మసాజ్ చేసి తర్వాత చల్ల నీళ్ళతో కడిగేయండి. ఇక చివరగా పడుకునే ముందు కొంచెం నెయ్యి ని లిప్ బామ్ లాగా అప్లై చేసేసి నిద్రపోండి. ఇక వారం రోజులలో మీకు మృదువైన పెదాలు వచ్చేస్తాయి. 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.