Home » ఉప్పులో ఎన్ని రకాలు ఉన్నాయి మరియు వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉప్పులో ఎన్ని రకాలు ఉన్నాయి మరియు వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

by Shalini D
0 comments

ఆహారాన్ని రుచిగా మార్చడంతో పాటు, మీ ఆరోగ్యానికి అనుగుణంగా ఏ ఉప్పు మీకు సరిపోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇది చదవండి. ఉప్పును ఆహారంలో రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. శరీర ఆరోగ్యానికీ కాస్త ఉప్పు అవసరమే. శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి సోడియం కూడా అవసరం.

ఇది ఉప్పు తినడం ద్వారా మాత్రమే లభిస్తుంది. అయినప్పటికీ, మంచి ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి పరిమిత పరిమాణంలో ఉప్పు తినాలని వైద్యులు సలహా ఇస్తారు. మీ ఆరోగ్యానికి ఏ ఉప్పు బాగా సరిపోతుందో తెలుసుకోవడానికి ముందు, ఉప్పులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఉప్పు తినడం వల్ల ఏ వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం లభిస్తుందో తెలుసుకోండి.

రాళ్లుప్పు: ఆయుర్వేదం ప్రకారం, రాతి ఉప్పు మిగిలిన ఉప్పు రకాల కంటే ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉప్పును ఉపవాస సమయంలో కూడా తీసుకుంటారు. తెలుపు, నల్లుప్పు కంటే 84 రెట్లు మెరుగు అని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉప్పులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, సెలీనియం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. ఇది గుండెల్లో మంట, అజీర్తి, ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

సముద్రపు ఉప్పు: సముద్రపు ఉప్పు లేదా సీసాల్ట్‌ను సముద్రపు నీటి నుండి తయారు చేస్తారు. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం లాంటి అనేక ఖనిజాలు ఉంటాయి.ఇది రాతి ఉప్పు కంటే కాస్త ఖరీదు ఎక్కువ. ఈ ఉప్పు రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

అయోడిన్ ఉప్పు: ఈ రకం ఉప్పులో అయోడిన్ అధికంగా ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రకం ఉప్పునే సాధారణంగా ఇళ్లలో ఉపయోగిస్తారు.

బ్లాక్ సాల్ట్: దీంట్లో ఉన్ లక్షణాల వల్ల ఆయుర్వేద మందుల్లో దీన్ని వాడతారు. మీ ఆహారంలో ఈ ఉప్పు చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలనూ, బ్లోటింగ్ సమస్యను కూడా నల్లుప్పు తగ్గిస్తుంది. అందుకే అసిడిటీ సమస్య ఉంటే మజ్జిగలో నల్లుప్పు కలిపి తాగమంటారు.

హిమాలయన్ పింక్ సాల్ట్: గులాబీ రంగులో ఉండే ఈ ఉప్పు ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత కాపాడుతుంది. చర్మం ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది.

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీనివల్ల శరీరంలో నీరు నిండటం మొదలై చేతులు, కాళ్లలో తీవ్రమైన వాపు వస్తుంది. అందుకే ఉప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment