88
ప్రతి ఒక్కరి ఇళ్లల్లో అరటిపండు అనేది కచ్చితంగా ఉంటుంది. అరటిపండుని మనం ఎంతో ఇష్టాంగా తింటాము. దీనిని మనం దేవుడికి నైవేద్యంగా పెడతాము మరియు దింట్లో ఉన్న పోషకాల కారణంగా మనము కూడా దీనిని మన ప్రతిరోజు ఆహరం తో పాటు తీసుకుంటూ ఉంటాం.
సాధారణంగా మనం అరటిపండు తిని తొక్కను పడేస్తూ ఉంటాం కానీ అరటి తొక్కతోను చాల ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలిస్తే మీరు ఇక అరటి తొక్కను అసలు పడేయరు. అరటి తొక్క లాభాలను తెలుసుకుందాం రండి.
- అరటి తొక్కలో ఉండే మెగ్నీషియం పళ్ళను శుభ్రపరచడం లో ఉపయోగపడుతుంది. అరటి తొక్కతో పళ్లకు వరం రోజులపాటు మసాజ్ చేస్తే మీ పళ్లకు పట్టిన గార అంత పోతుంది. దాంతో మీ దంతాలు ఆరోగ్యాంగా కనిపిస్తాయి.
- అరటి తొక్కను మొహం మీద 10 నిమిషాల పాటు రుద్దితే మొహం మీద ఉన్న మొటిమలు మొత్తం వరం రోజుల్లోనే కనుమరుగు అయిపోతాయి.
- అరటిపండు లో ఆంటీ-ఏజింగ్ లక్షణాలు బాగా ఉంటాయి. అరటికాయ తొక్కని పొడి చేసి దాంట్లో కొద్దిగా పలు వేసి ఒక మిశ్రమం లా తయారు చేసి ఆ మిశ్రమాన్ని మొహానికి పట్టించి 5 నిమిషాల తర్వాత కడిగేస్తే మొహం మీద ఉన్న ముడతలు అన్ని పోతాయి.
- మరొక అద్భుతమైన లాభం ఏంటి అంటే అరటి తొక్కతో సోరియాసిస్ కి కూడా చెక్ పెట్టొచ్చు. అరటి తొక్కలో మొయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండడం వలన మనం దానిని సోరియాసిస్ ఉన్న భాగం లో రుద్దితే జిల అనేది కొంచెం తగ్గుతుంది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.