Home » ఇలా తీసుకుంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది

ఇలా తీసుకుంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది

by Shalini D
0 comments
Apple cider vinegar is good for health in many ways

ఇలా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. యాపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఈ వెనిగర్ వినియోగించరు. బరువు తగ్గాలనుకునే చాలా మంది తమ ఆహారంలో యాపిల్ సైడర్ వెనిగర్‌ తీసుకుంటారు. అయితే ఈ పానీయం పూర్తిగా ఆరోగ్యకరమా? అనే సందేహం కొందరిలో లేకపోలేదు. ఆపిల్ సైడర్ వెనిగర్ ఖచ్చితంగా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ. దీనిని అధిక మొత్తంలో తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాసుడు నీటిలో కలుసుకుని తాగాలి. అంతకు మించి డోస్ పెంచితే దుష్ర్పభావాలు తప్పవంటున్నారు నిపుణులు. ఏమవుతుందో తెలుసా?

యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గుతాయి. ఇది కండరాలు, నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. రక్తపోటు కూడా పెరగవచ్చు. శరీరంలో అలసట కూడా కనిపించవచ్చు. అలాగే మొటిమలను తగ్గించడానికి యాపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. అయితే వెనిగర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై కాలిన గాయాలు, దద్దుర్లు, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అంటే ఇందులో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపులో చికాకు, గ్యాస్, గుండెల్లో మంట వస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ అంత రుచిగా ఉండదు. అంతేకాకుండా, ఈ పానీయం దంతాలకు హానికరం. ఇది దంతాల ఎనామెల్‌ను నాశనం చేస్తుంది. సున్నితత్వాన్ని పెంచుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కానీ ఈ డ్రింక్ ను ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోకుండా జాగ్రత్తపడాలి. నీరు, యాపిల్ సైడర్ వెనిగర్ సమపాళ్లలో తీసుకోకపోతే అది గొంతు చికాకుకు కారణం అవుతుంది. గొంతులో అసౌకర్యం పెరగవచ్చు. కాబట్టి ఈ డ్రింక్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.