Home » OTT లోకి తెలుగులో మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా…

OTT లోకి తెలుగులో మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా…

by Vinod G
0 comments

హాయ్ తెలుగు రీడర్స్ ! ఇటీవల కాలంలో ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను OTT వేదికలు మిగిలిన భాషల్లోకి మార్చి అందుబాటులోకి తెస్తున్నాయి. అందులో భాగంగా మలయాళం లో విజయవంతమైన ‘గురువాయుర్ అంబలనాదయిల్’ సినిమాను తీసుకురావడం జరిగింది. మే 16(2024) న ధియేటర్ రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని 90 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. జూన్ 27(2024)న మలయాళం తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

డైరెక్టర్: విపిన్ దాస్
తారాగణం: బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగి బాబు తదితరులు

కథ గురించి…

విను రామచంద్రన్(బసిల్ జోసెఫ్) దుబాయ్ లో పని చేస్తుంటాడు. అతడికి అంజలి(అనస్వర రాజన్) అనే అమ్మాయితో నిచ్చితార్థం అవుతుంది. అతడు పార్వతి(నిఖిలా విమల్) తో బ్రేకప్ అయి ఐదేళ్లు అయినా ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతుంటాడు. విను వాటి నుండి బయటపడేందుకు అతని బావ అయిన ఆనంద్(పృథ్విరాజ్ సుకుమారన్) సాయం చేస్తుంటాడు. అయితే, ఆనంద్ లైఫ్ కూడా ఏమి హ్యాపీగా ఉండదు. ఇతను భార్యకు దూరంగా జీవిస్తుంటాడు. అయితే ఒక రోజు విను తనకి ఎంతో సపోర్ట్ గా ఉండే ఆనంద్ జీవితంలో సంతోషం నింపాలనుకుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అనుకోని వ్యక్తిని కలుసుకుంటారు. దీంతో వీరి బంధం బీటలు వారుతుంది. ఒకరినొకరు అపార్థం చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అంజలిని విను వివాహం చేసుకున్నాడా? ఆనంద్ తన భార్యను కలుసుకున్నాడా? విను పెళ్లి ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నది ‘గురువాయుర్ అంబలనాదయిల్’ చిత్ర కథ…

మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు రీడర్స్ OTT ని సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.