50
బైజూస్‌లో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని తేల్చిన కేంద్రం? సంక్షోభంలో కూరుకుపోయిన బైజూస్‌కు కేంద్ర దర్యాప్తుతో ఊరట లభించినట్లు తెలుస్తోంది. సంస్థలో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని అధికారులు దర్యాప్తులో తేల్చినట్లు సమాచారం. నిధుల మళ్లింపు, అకౌంట్ల దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలను తోసిపుచ్చారట. అయితే యాజమాన్య నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. బైజూ రవీంద్రను సీఈఓగా తప్పించాలని ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.