Home » OTT లోకి వచ్చేసింది …బాక్

OTT లోకి వచ్చేసింది …బాక్

by Vinod G
0 comments

హాయ్ తెలుగు రీడర్స్ ! “బాక్” సినిమా ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారా? అయితే సిద్దమవండి. ఎందుకంటే బాక్ OTT రిలీజ్ డేట్ ని ప్రకటించేశారు.

ఈ బాక్ సినిమా తమిళంలో చంద్రకళ , రాజ్ మహల్ తదితర చిత్రాలు నిర్మించి విజయాలను అందుకున్న అరున్మలై ప్రాంచైజీ వారు నిర్మించారు. ఈ సినిమాను సుందర్ సి అన్ని తానై నడిపించాడు.

చిత్ర నిర్మాత, దర్శకుడు & రచన : సుందర్ సి
సంగీతం: హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ : కృష్ణ స్వామి
నటీనటులు: సుందర్ సి, తమన్నా, రాశికన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ తదితరులు.

కథ విషయానికి వస్తే శివశంకర్ (సుందర్ సి) ఓ న్యాయవాది. అతని సోదరి శివాని (తమన్నా) తన మనసుకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అది వారి కుటుంబానికి నచ్చదు, దాంతో వారిని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటారు. ఆలా వెళ్ళిపోయినా శివాని తన భర్త, పిల్లలతో కుటుంబానికి దూరంగా జీవిస్తుంటారు. ఇలా ఉండగా ఒకసారి శివాని ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు.

ఇవన్నీ తెలుసుకొన్న తన అన్న అయిన శివశంకర్ కి అనుమానం వస్తుంది. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. అలాగే వారి మరణాలలో దాగి ఉన్న రహస్యాలను వెలికితీయాలని రంగం లోకి దిగుతాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి విషయాలు తెలిసాయి? శివాని నిజంగా ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేసారా? బాక్ అనే దుష్ట శక్తీ ఏంటి ? శివశంకర్ తన చెల్లి మరణానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? అనే కోణంలో కథ సాగుతుంది. నవ్వించి భయపెట్టడం అనే కోణం లో కథ సాగుతుంది. అయితే మీరు కూడా జూన్ 21(2024) న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే “బాక్” ను చూసి ఎంజాయ్ చెయ్యండి.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ని సందర్శించండి.

You may also like

Leave a Comment