Home » నే తొలిసారిగా – సంతోషం

నే తొలిసారిగా – సంతోషం

by Rahila SK
786 views
ne tolisariga - santhosham

పాట: నే తొలిసారిగా
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: ఉష
చిత్రం: సంతోషం (2002)
సంగీత దర్శకుడు: R.P పట్నాయక్
తారాగణం: గ్రేసీ సింగ్, నాగార్జున, శ్రియ శరణ్


నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా
నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా
స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా
నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడవాలను చెప్పు నువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదలిన కధ
వెతికే మనసుకు మమతే పంచుమా
నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా
నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వేసుమా
పెదవులపై చిరునవ్వుల దగా కనబడనీయవు నిప్పులసెగ
నీటికి ఆరని మంటలు రూపమా
నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.