Home » భూమ్ బద్దాల్ – క్రాక్

భూమ్ బద్దాల్ – క్రాక్

by Haseena SK
0 comments
bhoom bhaddhal song

ఊళ్ళో ఏడ ఫంక్షన్ జరిగిన మనమే కదా ఫస్టు గెస్టు
దద్దరిల్లే దరువుల లెక్కన మన ఐటమ్ సాంగ్ మస్టు
అల్ ది బెస్టు

చీమకుర్తిలో కన్ను తెరిసా చినగంజాంలో నా ఒళ్ళు విరిసా
అట్టా అట్టా అందాలను పరిసా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా
ఏ చోటుకి పోయినా అదే పాత వరసా
చిన్నా పెద్దా నన్ను చూసి వచ్చేస్తారు వలస
ఆ కష్టం పల్లేక ఆళ్ళ గోల సూల్లేక
గాల్లోన ముద్దులని ఎగరేసా

ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్
భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్ అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు మనదే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిసా చినగంజాంలో నా ఒళ్ళు విరిసా
అట్టా అట్టా అందాలను పరిసా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తాందే
మా టంగుటూరు లతా లచ్చిమి గుర్తొస్తాందే
నువ్వు నవ్వుతుంటె గుండెకింద సలుపొస్తాందే
నా సైడ్ క్రాఫ్ తెలుపు కూడా నలుపొస్తాందే
స్టేజి మీదకెక్కనియ్యి వంద నోట్ల దండేస్తా
వంద కోట్ల సొట్ట బుగ్గ కందకుండా పిండేస్తా
కరువుతీరా ఒక్కసారి కావులించి వదిలేస్తా

నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తాందే
మా టంగుటూరు లతా లచ్చిమి గుర్తొస్తాందే
డీజే డీజే డీజే డీజే ఇది డీజే కాదురొరేయ్
ఇది ఓజే ఒంగోలు జాతర ఓజే ఓజే ఓజే

యమ ఆర్కెస్ట్రా డాన్సు మీకు దొరికిందే చాన్సు
ఐ లవ్ యు మై ఫ్యాన్సు అందరికీ థాంక్సు
ఈ రాతిరి మీకు ఫుల్ మీల్సు
దిమ్మ తిరిగే రిలాక్సు అడగన్లే టాక్సు
తెల్లార్లు కొట్టండి క్లాప్సు

నీ జోషు నీ గ్రేసు అబ్బో అబ్బో అదుర్సు
నీ ముందర జుజూబీలే మిస్ ఇండియా ఫిగర్స్
ఎయ్ వన్ టౌన్ రాజా నీ ఫన్ టౌన్ కి వచ్చానే
వినిపించెయ్ నా జ్యూక్ బాక్సు

ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్
భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్ అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు మనదే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిసా చినగంజాంలో నా ఒళ్ళు విరిసా
అట్టా అట్టా అందాలను పరిసా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.