Home » ఒక్కసారి చెప్పలేవ- నువ్వు నాకు నచ్చావ్

ఒక్కసారి చెప్పలేవ- నువ్వు నాకు నచ్చావ్

by Lalitha Pandala
0 comments
okkasari cheppaleva song

ఒక్కసారి చెప్పలేవ… నువ్వు నచ్చావని

ఓ ఓఓ… చెంత చేరి పంచుకోవా… ఆశని శ్వాసని

మన గుండె గుప్పెండంతా… తన ఊహ ఉప్పెనంతా

ఒదిగుండమనక వదిలేయమంటు… బతిమాలుతున్న వేళా

వెన్నెలేదో వేకువేదో… నీకు తెలుసా మరి

ఓ ఓఓ… నిదురపొయే మదిని గిల్లి… ఎందుకా అల్లరి

చందమామ మనకందడని… ముందుగానె అది తెలుసుకుని

చేయిచాచి పిలవద్దు అని… చంటి పాపలకు చెబుతామా

లేనిపోని కలలెందుకని… మేలుకుంటె అవి రావు అని

జన్మలోనె నిదరోకు అని… కంటి పాపలకు చెబుతామా

కలలన్నవి కలలని నమ్మనని… అవి కలవని పిలవకు కలవమని

మది మీటుతున్న మధురానుభూతి… మననడిగి చేరుతుందా

ఒక్కసారి చెప్పలేవ… నువ్వు నచ్చావని

ఓ ఓఓ… చెంత చేరి పంచుకోవా… ఆశని శ్వాసని

అందమైన హరివిల్లులతో… వంతెనేసి చిరుజల్లులతో

చుక్కలన్ని దిగివస్తుంటే… కరిగిపోని దూరం ఉందా

అంతులేని తన అల్లరితో… అలుపు లేని తన అలజడితో

కెరటమెగిరి పడుతూ ఉంటే… ఆకాశం తెగి పడుతుందా

మనసుంటే మార్గం ఉంది కదా… అనుకుంటే అందనిదుంటుందా

అనుకున్నవన్ని మనకందినట్టె… అనుకుంటే తీరిపోదా

ఒక్కసారి చెప్పలేవ… నువ్వు నచ్చావని

ఓ ఓఓ… చెంత చేరి పంచుకోవా… ఆశని శ్వాసని

మన గుండె గుప్పెండంతా… తన ఊహ ఉప్పెనంతా

ఒదిగుండమనక వదిలేయమంటు… బతిమాలుతున్న వేళా….

మరిన్ని తెలుగు పాటలు కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.