Home » నిన్ను కన్న కనులే సాంగ్ లిరిక్స్ – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

నిన్ను కన్న కనులే సాంగ్ లిరిక్స్ – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

by Vishnu Veera
0 comments

నిన్ను కన్న కనులే మెరిసేనుగా

కన్న పేగు మరలా మురిసేనుగా

నిన్నలన్ని వరమై కురిసేనుగా

గుండెలన్ని తేనెల తడిసేనుగా

నేనే నిన్ను చెయ్యారా పెంచని అమ్మ

నీదే కద కోట్లాది అమ్మలా ప్రేమ

పసివాడా పసివాడా

ఏళ్ళేదిగిన పసివాడా

కలలాగా కలిశావే

నిన్నిక వీడెను గ్రహణపు నీడ

నిన్నటికీ ఇప్పటికీ

నీలో లేదే తేడా

పసినవ్వుల రువ్వినది

నీ పెదవులపై నీ మీసం కూడా

నిన్ను కన్న కనులే మెరిసేనుగా

కన్న పేగు మరలా మురిసేనుగా

నిన్నలన్నీ వరమై కురిసేనుగా

గుండెలన్ని తేనెల తడిసేనుగా

తడి తగలని పుడమికి నేడు

చిరు చినుకే నీ రాక

జన్మలో ఇది మరుజన్మం

ఇక లోతేది నువ్వు చేరాక

రక్తబంధమొచ్చి బలమిచ్చాక

యుద్ధ విజయము కాయమిక

యే పొగరిటు రాగలదిక

మన చేతులు కలిసాక

సద్దే లేనే లేని

నీరెండంటే నీవే

అలసిన గుండెల నిండా

నువ్వు ఆనందాలను పొదిగావే

పసివాడా పసివాడా

ఏళ్ళేదిగిన పసివాడా

కలలాగా కలిశావే

నిన్నిక వీడను

గ్రహణపు నీడ

ఆహ…

ఇదేం వాస్తవం కలలా ఉందే ఈ క్షణం

నాతో ఇలా ఉన్నదీ నీవేనా నిజమేనా

చెలియా నిన్నే కలవడం కాలాలనే గెలవడం

కనుపాపలో కాంతిగా నీవేనా నిజమేనా

చిరునామా తెలిసిన చిలకల్లే

ఎదగూటిలో వాలావే

కాలం కదలిక లేవైనా

నిలిచావే నీలానే

పోదాం… పసివారై నిన్నల్లోకి

ఉందాం … ఆ చోటే మనం ఎన్నటికీ

నిన్ను కన్న కనులే మెరిసేనుగా

కన్న పేగు మరలా మురిసేనుగా

నిన్నలన్ని వరమై కురిసేనుగా

గుండెలన్ని తేనెల తడిసేనుగా


చిత్రం: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
గాయకులు: యువన్ శంకర్ రాజా, SP చరణ్, చిత్ర
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: యువన్ శంకర్ రాజా
దర్శకత్వం: వెంకట్ ప్రభు
తారాగణం: తలపతి విజయ్, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment