చిత్రం : కరెంట్ తీగ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: అచ్చు
గాయకుడు: కార్తీక్
తారాగణం: మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్

pilla o pilla telugu lyrical song

అదిరెను అదిరెను యదసడి అదిరెను… 

కలిగెను కలిగెను అలజడి కలిగెను…

గిరగిర తిరిగెడి భూమి నిలిచెను… 

గలగల కదిలెడి గాలే నిలిచెను…

మనసులొ తొలకరి మెక్క మొలిచెను… 

వయసున మగసిరి పొద్దు పొడిచెను..

నరనర నరములు సలసల మరిగెను…

నిన్నలేని నిప్పులాంటి తూఫాను…

గుండెల్లోన వెయ్యివేల పిడుగులు పగిలెను… 

కోటికోట్ల మెరుపుల కత్తి దాడి జరిగెను… 

నాపై… నాపై…నాపై…నాపై…నాపై…నాపై…

కాలికింది నేలకూడ నన్ను వీడి కదిలెను… 

ప్రాణమంత పిండుతున్నతీపిభాద రగిలెను…

ఏమయిందో ఏమయిందో రెప్పమూసి తీసెలొగ…

ఏమయిందో చూసెలొగా నాలొ నేను లేనెలేను…

పిల్లా ఓ పిల్లా నా చూపుల్లొన మెరిసావె… 

పిల్లా ఓ పిల్లా నా ఊపిరిలోన కలిసావె…

పిల్లా ఓ పిల్లా నా దేవత నువై నిలిచావే… అయ్యో…

పాదరసమునే పోతపొసి నీ మెరుపు దేహమే మలిచారు…

పూలపరిమళం ఊపిరూది నా పైకి నిన్నిలా వదిలారు..

అద్బతాలాన్నీఒకచొటే వెతికి నిన్నుచేరినాయేమో…

పొలికలు సోలిపొయే రూపం నీదే…

పిల్లా ఓ పిల్లా నా గుండె తలుపు తట్టావే… 

పిల్లా ఓ పిల్లా నా ప్రేమ దారి పట్టావే…

పిల్లా ఓ పిల్లా నా కల్లో దీపం పెట్టావే… అయ్యో…

హోరుగాలిలో నెమలికన్నులా తేలుతుంది మది నీవల్లే…

జోరువానలొ ఆడుతున్న నా అంతరంగమోక హరివిల్లే…

పసిడి పరువాల పసిపాప మరువదే నిన్ను కనుపాప…

జన్మకే జ్ఞాపకంగా చూసా నిన్నే…

పిల్లా ఓ పిల్లా నా లోకంలొ అడుగెట్టావె… 

పిల్లా ఓ పిల్లా నీ అందంతో పడగొట్టావె…

పిల్లా ఓ పిల్లా నా కొసమే నువ్వు పుట్టావే… అయ్యో…

పిల్లా ఓ పిల్లా నీ అందం దెబ్బ తిన్నానే… 

పిల్లా ఓ పిల్లా నే తేరుకోలేకున్నానే…

పిల్లా ఓ పిల్లా నీ ప్రేమలొ పడుతున్నానే… అయ్యో…

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published