Home » మెరుపై సాగరా-స్టైల్

మెరుపై సాగరా-స్టైల్

by Nithishma Vulli
0 comments
gelupai sagara song

సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: కార్తీక్

merupai sagara song

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా
వెనకడుగే వేయక ముందుకు సాగరా
నలుదిక్కులు నవ్వుతు ఉన్నా
నలుపెక్కని సూర్యుడు నువ్వై
ఆ చుక్కలనే ఇల దించే నీ శక్తి ని యుక్తి గ చూపెయ్
నటరాజై నువు రాజెయ్ నీ గెలుపే నీలో
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి
కొండలే డీకొట్టరా అది ఎంత కష్టమైనా
ఆశయాల పీఠం నువు అందుకున్న నాడు
నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా
చేయూతే ఇస్తుంటే ఓ స్నేహబంధం
చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం
నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం
ప్రతి అడుగు కావాలి నీ వెనుక సైన్యం
లేరా అడుగెయ్ రా ఆ శిఖరం చేరా

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి
అలలతో పోటి పడి చేరాలి కలల కడలి
పందెమేది ఐనా నీ పట్టుదలను చూసి
ఒంటరై వణకాలిరా ఆ ఓటమైనా హడలి
అందరికి చేతుల్లో ఉంటుంది గీతా
నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మ రాత
నీ కాలు అడుగులతో కాలాన్ని ఆపి
లోకాలే పొగిడేలా చూపించు ఘనత
లేరా చిందెయ్ రా విజయం నీదేరా
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

మరిన్ని తెలుగు పాటల కోసం తెలుగు రీడర్స్ ను సంప్రదర్ సంప్రదించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.