Home » వెన్నెలవే వెన్నెలవే – మెరుపు కలలు

వెన్నెలవే వెన్నెలవే – మెరుపు కలలు

by Rahila SK
817 views
vennelave vennelave song lyrics merupu kalalu

వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే
వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే

వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే
నీకు భూలోకుల కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఇది సరసాల తొలిపరువాలా జత సాయంత్రం సైయన్న మందారం
ఇది సరసాల తొలిపారువాలా జత సాయంత్రం సైయన్న మందారం
చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసి పున్నాగం

పిల్ల ఆ పిల్ల ఆ
భూలోకం దాదాపు కన్ను మూయు వేళా
పాడెను కుసుమాలు పచ్చ గడ్డి మీనా
ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా

వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే
నీకు భూలోకుల కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట
కౌగిట్లో చిక్కుపడి గాలికి అడ్డెవరంటా
ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ

పిల్ల ఆ పిల్ల ఆ
పూదోట నిద్రొమ్మని పూలే వరించు వేళా
పోటీగా కలలోపల తేనె గ్రహించు వేళా
ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లె ప్రేమించు

వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే
నీకు భూలోకుల కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా


పాట: వెన్నెలవే వెన్నెలవే
గీతరచయిత: వేటూరి సుందరరామ మూర్తి
గాయకులు: హరిహరన్, సాధన సర్గం
చిత్రం: మెరుపు కలలు (1997)
సంగీత దర్శకుడు: A.R.రెహమాన్
తారాగణం: అరవింద్ స్వామి, కాజోల్, ప్రభుదేవా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.