అగ్గంటుకుంది సంద్రం
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
చల్లారె చెడు సాహసం
జగడపు దారిలో
ముందడుగైన సేనాని
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యిందివేళ
విధికే ఎదురై వెళితే విల విలా
అలలయ్యే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా
దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
భయమున దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
పాట: దూకే ధైర్యమా జాగ్రత్త
చిత్రం: దేవర పార్ట్ – 1 (2024)
తారాగణం: ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, సైఫ్ అలీ ఖాన్
గాయకులు: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
చుట్టమల్లె (Chuttamalle) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.
1 comment
[…] దూకే ధైర్యమా జాగ్రత్త – దేవర పార్ట్ R… […]