తలచినచో జరుగునని కల నిజమై దొరకునని
అరెఅరెఅరెరెరె అనుకోలేదు ఎపుడు
అరెఅరెఅరెరెరె ఎదురుగా నిలిచెను చెలి తోడు
అరెఅరెఅరెరెరె అరుదుగ కలవరం ఇపుడు
ఘుమ ఘుమ స్వరముగా పలికేనే నాలో నేడు

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత
సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత

రమ్మని అనలేదు రాలేదనుకోలేదు
మనసులో ఇష్టంగా ఉన్ననల
కలత పాడనేలేదు కంగారైపోలేదు
ప్రేమగ ప్రేమించా లో లోపల

ఓర్పుగా వేచిన చోటే తూర్పుగ ఉదయిస్తోంది
మార్పు జరిగేలా ఈ లోకం అంత నాకు సాయపడుతోంది

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత

ఆవిరి అయిపోయాయి ఇన్నాళ్ల దూరాలు
మాయం అయిపోయాయి సందేహాలు
చెరువవుతున్నాయి సంతోష తీరాలు
చెలియాతో నేనుంటే అంతే చాలు

కారణం ఏమైతేనేం కాలమే కలిసొచ్చింది
ప్రేమ నన్ను నమ్మి నా పెదవి పైన తోరణాలు కడుతోంది

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత
సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published