నటీనటులు: విశాల్, త్రిష కృష్ణన్, సునైనా
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం- గాయకులు: ఎన్. సి. కారుణ్య
నిర్మాత: టి. రమేష్
దర్శకుడు: తిరు

సంవత్సరం: (2013)

andam andam song lyrics

అందం అందం తన కళ్ళందం
తనలా లేదే ఇక ఏ అందం
అందం అందం తన మాటందం
అలలా ఎగసే తన మనసందం
అందం అందం తన కళ్ళందం

తనలా లేదే ఇక ఏ అందం
అందం అందం తన మాటందం
అలలా ఎగసే తన మనసందం
తుళ్ళిపడినా ఆ నడకందం

కట్టు జారే ఆ పైటందం
అయ్యయ్యో చిత్రంగా నడిచే
అయ్యయ్యో చిత్రపటం తనే
అయ్యయ్యో చక్కెర కలిపే

అయ్యయ్యో చెక్కరు తనువే
అందం అందం …
అందం అందం …
అంత చిన్న చోటులో ఎన్ని పూల తేనో నింపుకుంటు ఉన్న పెదవందం

సందెల్లో ఆకాసం రంగులను పోలి కంది కందనట్టుండే బుగ్గలందం
బక్కచిక్కు నడుముదే ఎంతెంతో అందం
మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే మతిపోయే అందం
కలలు కవితలకే అందనట్టి అందం తనదే….

గట్టులెన్నో దాటే చిట్టి యేరు లాగా సిగ్గు వడి దాటే సొగసందం
కళ్ళు రెండూ కలసి అల్లే వలలాగా గుండె బందించేటి చూపందం
రత్నాలళ్లే తళుకనే నవ్వుల్లో అందం
దూరం నుండి ఆలోచిస్తే ఇంకేదో అందం

కలలు కవితలకే అందనట్టి అందం తనదే……
అందం అందం తన కళ్ళందం
తనలా లేదే ఇక ఏ అందం

అందం అందం తన మాటందం
అలలా ఎగసే తన మనసందం
తుళ్ళిపడినా ఆ నడకందం
కట్టు జారే ఆ పైటందం

అయ్యయ్యో చిత్రంగా నడిచే
అయ్యయ్యో చిత్రపటం తనే
అయ్యయ్యో చక్కెర కలిపే
అయ్యయ్యో చెక్కరు తనువే

అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published