62
ఎదో ఆశా ఎదలో మొదలైనది
ఎపుడూ జాడ లేనిదీ
నిజం తెలుసా ఈనాటిది కాదది
ఇపుడే మెలుకున్నదీ
ఇలా నీ శ్వాస గిల్లీ
లెమ్మంటూ నన్నల్లుకుందీ
నిశీధిలో ఉషోదయంలా
ఎదో ఆశా ఎదలో మొదలైనది
ఎపుడూ జాడ లేనిదీ
ఎపుడూ జాడ లేనిదీ
నీ లాలిని పాడే లాలన నేనూ
జాబిలికై ఆశ పడే బాలను నేనూ
తల్లిగా జోకొట్టీ చలువే పంచాలో
చెలిగా చేపట్టీ చనువే మించాలో
సరిగా నాకే ఇంకా తేలని ఈవేళా
ఎదో ఆశా ఎదలో మొదలైనది
ఎపుడూ జాడ లేనిదీ
నిజం తెలుసా ఈనాటిది కాదది
ఇపుడే మెలుకున్నదీ
నీ నీలి కన్నుల్లో వెతుకుతూ ఉన్నా
క్షణానికో రూపంలో కనబడుతున్నా
జాడవై నా వెంటా నిను నడిపించాలో
జానకై జన్మంతా జంటగా నడవాలో
తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీలా
ఎదో ఆశా ఎదలో మొదలైనది
ఎపుడూ జాడ లేనిదీ
నిజం తెలుసా ఈనాటిది కాదది
ఇపుడే మెలుకున్నదీ
మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.