Home » ఓ పిల్లా శుభానల్లా – సర్దార్ గబ్బర్ సింగ్

ఓ పిల్లా శుభానల్లా – సర్దార్ గబ్బర్ సింగ్

by Kusuma Putturu
0 comment

 ఓ పిల్లా శుభానల్లా ..

వచ్చావే ఎండల్లో వెన్నెల్లా ..

నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా ..

నా ఖాకీ చొక్కాని రంగుల్లో ముంచావే..

నా లంగా ఓణీకీ చీరల్లే సిగ్గందించావే..

ఓ పిల్లా శుభానల్లా..

వచ్చావే ఎండల్లో వెన్నెల్లా..

నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా..

నీ కళ్ళల్లో మాయున్నది.. 

ఆ చూపుల్లో మందున్నది..

ఖైదీల అంతు చూసే నన్నే..

ఖైధీలా కూర్చో పెట్టాశావే..

నీ నవ్వుల్లో మహిమున్నది..

గిలిగింతలే పెడుతుందది.. 

మౌనాన్నే వాటేసే నాతోనే..

ఏదేదో మాటాడిస్తున్నాదే..

ఏ ఈత రానోడ్ని…గోదాట్లో తోసావే…

మళ్ళీ మబ్బుల్లో తేల్చావే …

ఓ పిల్లా శుభానల్లా..

వచ్చావే ఎండల్లో వెన్నెల్లా..

నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా..

మామూలుగా మొండోడినీ..

ఏ మూలనో మంచోడినీ..

హయ్యొయ్యో ఇప్పుడీరెండు కాక..

చంటోడినైపోయా నిను చూశాకా…

నేనెప్పుడు నా దానిని..

నాలా ఇలా నన్నుండనీ..

మార్చావా వచ్చేస్తా నీ దాకా ..

నన్నైనా నేను ఆపలేకా… 

నే కాల్చే తూటాలూ…పువ్వుల్లా పుట్టాయే.. 

నీ మెల్లో దండేయ్ మన్నాయే…

ఓ పిల్లా శుభానల్లా..

వచ్చావే ఎండల్లో వెన్నెల్లా..

నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా..

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కోసం తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment