Home » రుచికరమైన చికెన్ బిరియాని

రుచికరమైన చికెన్ బిరియాని

by Farzana Shaik
0 comment

చికెన్ బిర్యానీ అంటే నాన్ వెజిటేరియన్స్ అందరికీ ఇష్టమే. మనదేశంలో చాలా మంది ఫంక్షన్స్ లేదా ఇతర సందర్భాల్లో ఎక్కువగా ప్రియార్టీ ఇచ్చే వంటంకం కూడా ఇదే. ఈ వంటకం మనకు ఎప్పటి నుంచో సరే ఈ వంటకాన్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

చికెన్‌ – ఒక కిలో, బాస్మతి బియ్యం – ఒక కిలో, గరం మసాలా – రెండు టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, పెరుగు – ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, పచ్చిమిరపకాయలు – ఐదు, ఎండు మిరపకాయలు – ఆరు, పసుపు – చిటికెడు, కొత్తిమీర – ఒక కట్ట, ఉప్పు – తగినంత, నూనె – సరిపడంతా తీసుకోవాలి.

chicken biryani


తయారుచేయు విధానం:

ముందుగా చికెన్ ముక్కలను కడిగి ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. మారినేషన్ అయ్యేందుకు 20 నుంచి 30 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద రెండు కప్పుల బియ్యానికి మూడున్నర కప్పుల నీళ్లు పోసి పెట్టాలి. ఇందులో యాలకులతోపాటుగా మసాలా దినుసులు, ఉప్పు కూడా వేసి కలపాలి.

ఇంకోసైడ్. స్టవ్ మీద బిర్యానీ వండే కడాయి పెట్టి. అందులో నూనె వేసి ఉల్లిపాయలు తరుగు, పచ్చిమిర్చి వేయించాలి. అందులో మారినేషన్ చేసిన చికెన్ మెుత్తాన్ని వేసి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. చిన్న మంట మీద చికెన్ ను ఉడికించాలి. నూనె పైకి తేలే వరకూ కర్రీలా ఉడికించుకోవాల్సి ఉంటుంది. మంట కాస్త తక్కువగా పెట్టుకోవాలి.

అన్నం మెత్తగా ఉడికించొద్దు. స్టవ్ కట్టేసి, ఈ చికెన్ మిశ్రమాన్ని వేయాలి. అన్నం పలుకులుగా ఉంటుంది.. సో కొన్ని నిల్లు చల్లుకోవచ్చు. పైన మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఓ ఐదు నిమిషాలు. అలా ఉడికిస్తే అన్నం బాగా ఉడికేస్తుంది. పావుగుంటసేపు మూయకుండా అలానే వదిలేయాలి ఇంకేం కాసేపటికి వేడి వేడి బిర్యానీ రెడీ.

ముగింపు:

ఇక స్టవ్ మీద నుంచి కిందకు దించాలి. తినేముందు ఎక్కువగా కలుపుకోవద్దు. అలా చేస్తే ముద్దముద్దగా అయ్యే అవకాశం ఉంది. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం తెలుగురీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment