Home » చికెన్ షావర్మా తయారీ విధానం

చికెన్ షావర్మా తయారీ విధానం

by Haseena SK
0 comment

కావాల్సినవి పదార్దాలు:
బోనెలెస్ చికెన్ – 3/4 kg
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్
కారం – రెండు టీస్పూన్లు
పసుపు – అర టీస్పూన్
ధనియాలపొడి – అర టీస్పూన్
జీలకర్రపొడి – అర టీస్పూన్
చికెన్ మసాలా పొడి – 1స్పూన్
నిమ్మరసం – 2 స్పూన్లు
పెరుగు – అరకప్పు
నూనె – తగినంత
ఉప్పు – తగినంత

చికెన్ స్టఫ్ తయారీ: ముందుగా ఒక గిన్నెతీసుకుని దానిలో చికెన్ వేసి బాగా కడగాలి. తరువాత మరో గిన్నె తీసుకుని అందులో కడిగిన చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, చికెన్ మసాలపొడి, నిమ్మరసం,పెరుగు, నూనె, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపి మిశ్రమాన్ని 10 నుంచి 20 నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నెపెట్టి అందులో ముందుగా పక్కన పెట్టిన చికెన్ వేసుకోని దాన్ని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత చికెన్ స్టఫ్ రెడీ అవుతుంది, దీన్ని నీ స్టవ్ మీద నుండి దించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత చపాతిలను తాయారు చేసుకోవాలి…

కావాల్సినవి:
గోధుమపిండి – 1కప్పు
మైదా – అరకప్పు
నూనె – 2 స్పూన్లు
ఉప్పు – తగినంత
నీళ్లు – తగినంత

తయారీ: ముందుగా ఒక గిన్నెతీసుకుని అందులో గోధుమపిండి, మైదా, నూనె, ఉప్పు వేసి కొంచంకొంచంముగా వాటర్ పోసుకుంటూ బాగా కలపాలి. దాన్ని చిన్న చిన్న ఉండాల చేసుకొని వాటిని చపాతిలా ఒత్తుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దాని మీద చపాతి వేసి రెండు వైపుల బాగా కాల్చుకోవాలి. తరువాత ఒక చపాతీ తీసుకుని, అందులో మైనస్ వేసి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసి, ముందు గా రెడీ చేసుకున్న చికెన్ స్టఫ్ ను అందులో పెట్టాలి. తరువాతా దీన్ని ఒక టిషుపేపర్ తీసుకుని రోల్ ల చుట్టుకోవాలి. దీన్ని టమాటో సాస్ తో పిల్లలకు మరియు పేద్దలకు ఇస్తే ఇష్టంగా తింటారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment