88
కావలసిన పదార్దాలు:
- 200 గ్రా బోన్‌లెస్ చికెన్
- 2-3 టొమాటోలు
- 1 ఉల్లిపాయ
- 2 టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
- 2 స్పూన్ల కారం
- 1/4 స్పూన్ పసుపు
- 1 స్పూన్ గరం మసాలా
- 1 టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు నూనె
- 3 టేబుల్ స్పూన్లు పెరుగు
- కొన్ని కొత్తిమీర ఆకులు
- రుచికి తగినంత ఉప్పు
తయారీ విధానం:
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోండి, టొమాటోలు, ఉల్లిపాయలు కడిగి ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు వేసి రంగు మారి గోల్డ్ కలర్ వచ్చేవరకు వరకు వేయించాలి. తరువాత దానికి అల్లం వెల్లులి పేస్ట్ కలుపుకొని కొద్దిగా కలిసే వరకు వేయించాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి పసుపు, ఉప్పు, కారం వేసి మెత్తగా వేయించాలి, ఆపైన పావు వంతు నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించాలి. అనంతరం చికెన్ ముక్కలు వేయాలి, దాంతో పాటు గరం మసాలా, పెరుగు వేసి వేసి మూతపెట్టి చికెన్ ఉడికేంత వరకు 10-15 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర, పొదిన చల్లుకోవాలి. అంతే మనకు కావలసిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.
మరిన్ని వంటకాల గురించి తెలుసుకోవడానికితెలుగు రీడర్స్ని సందర్శించండి .