Home » ఇంటిలోనే స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడం ఎలా ?

ఇంటిలోనే స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడం ఎలా ?

by Shameena Shaik
0 comment

కావలసిన పదార్ధములు:

ఉల్లిపాయలు, కాప్సికమ్, పచ్చిమిర్చి, క్యారెట్, గుడ్లు, తెల్లగడ్డలు, అల్లం, ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, నూనె, అన్నం,కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసం.

fried rice

తయారీ విధానము:

ముందుగా నాలుగు ఉల్లిపాయలు, ఒక కాప్సికమ్, ఒక క్యారెట్, రెండు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పెట్టుకోవాలి. రెండు తెల్లపాయలు మరియు కాస్త అల్లం ని కచ్చా పచ్ఛా గా దంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి అది కొంచెం వేడి అయ్యాక ముందు గా దంచి పెట్టుకున్న అల్లం వెలుల్లి పేస్టును అందులో వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత మూడు లేదా నాలుగు గుడ్లను కొట్టి కడాయి లో వేసుకుని వేయించుకోవాలి.

ఇప్పుడు మనం ముందు గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని హై ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. రెండు నిమిషాలు అలా వేగాక కాప్సికమ్, క్యారెట్ ను వేసుకుని పచ్చి వాసన పొయ్యే వరకు మరి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, 1tbs టమోటాసాస్, 1tbs వెనిగర్, 1tbs చిల్లిసాస్, 1/2tbs సోయాసాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి.

తదుపరి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని కాస్త గరం మసాలా, కాస్త మిరియాల పొడిని, 2tbs నూనెను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మూడు నిమిషాలూ వేగాక అర టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని ఫైనల్ గా కలియబెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.

fried rice

ఒక ప్లేట్ లోకి మనం తయారు చేసుకున్న రైస్ వడ్డించుకుని దానిపై కొన్ని ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే నోరూరించే యమ్మి యమ్మి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ!

ముగింపు:

అందరూ పై పద్ధతిలో ఫ్రైడ్ రైస్ చేసుకున్నట్లైతే ఇంట్లో ఉన్న పదార్థములతోనే అతి తక్కువ సమయంలో రుచికరమైన మరియు హెల్తీ అయినటువంటి ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. మరిన్ని వంటకాలకు దీన్ని సందర్శించండి, తెలుగు రీడర్స్.

You may also like

Leave a Comment