కావలసిన పదార్థాలు:
- అరటికాయ ముక్కలు – 1 కప్పు.
- గరం మసాలా – 1 టీస్పూన్.
- కారం – 1 టీస్పూన్.
- పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా.
- పసుపు – చిటికెడు.
- ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు.
- టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్.
- క్యాప్సికం ముక్కలు – 1 టేబుల్ స్పూన్.
- క్యారెట్ తురుము – 1 కప్పు.
- కొత్తిమీర తురుము – 2 టీస్పూన్లు.
- ఉప్పు – తగినంత.
- నూనె – తగినంత.
- ఓట్స్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్.
- మైదా పిండి – 1 టేబుల్ స్పూన్.
- బియ్యపుపిండి – 1 టేబుల్ స్పూన్.
- నీళ్లు – సరిపడా.
- గోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్.
తయారీ విధానం:
ముందుగా ఒక అరటికాయ తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని పకన్నాపెట్టుకోవాలి. ఆ తరువాతా ఒక క్యారెట్ తీసుకొని దానిని తురుముల చేసుకొని పకన్నాపెట్టుకోవాలి. ఆ తరువాతా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెతీసుకుని దానిలో అరటికాయ ముక్కలును వేసి మెత్తగా ఉడికించి పకన్నాపెట్టుకోవాలి. ఇపుడు ఒక పెన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి క్యారెట్ తురుమును దోరగా వేయించి పకన్నాపెట్టుకోవాలి. తర్వతా ఒక గిన్నెతీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నూనె, ఓట్స్ పౌడర్, మైదా పిండి, బియ్యపుపిండి వేసుకుని కొద్దీ కొద్దీగా నీళ్లు పోసుకుంటూ దోసెలా పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో దోసెల్లా వేసి పకన్నాపెట్టుకోవాలి.
ఇపుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని పకన్నాపెట్టుకోవాలి. 1 లేదా 2 పచ్చిమిర్చిలని కూడా చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని పకన్నాపెట్టుకోవాలి మరియు 2 టొమాటో లను తీసుకొని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని పకన్నాపెట్టుకోవాలి మరియు ఒక క్యాప్సికం లను తీసుకొని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని పకన్నాపెట్టుకోవాలి మరియు కొత్తిమీర కొద్దగా తీసుకొని దానిని తురుముల చేసుకొని పకన్నాపెట్టుకోవాలి.
ఇపుడు మల్లి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో నూనె పోసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టిన మెత్తగా ఉడికిన అరటికాయ ముక్కలు, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు ఇలా అన్ని వేసుకొని గేరిటతో తిప్పుతూ ఉండాలి. చివరిగా కొత్తిమీర తురుము వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొవాలి. ఆ తర్వత ఒక్కో దోసెలో కొద్ది కొద్దిగా ఈ అరటికాయ మిశ్రమంన్నీపెట్టుకుని రోల్స్ ల చేసుకోవాలి. తర్వత ప్రతి రోల్ కి ఇరువైపులా దోరగా వేయించిన క్యారెట్ తురుమును పెట్టుకొని సర్వ్ చేసుకొంటే సరిపోతుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.