Home » నల్ల కారం పొడి ఇలా చేస్తే రుచిగా ఉంటుంది

నల్ల కారం పొడి ఇలా చేస్తే రుచిగా ఉంటుంది

by Shalini D
302 views
Black pepper powder

నల్ల కారం పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

  1. ధనియాలు – అరకప్పు
  2. పొట్టు తీయని మినుములు – రెండున్నర స్పూన్లు
  3. జీలకర్ర – ఒక స్పూను
  4. శెనగపప్పు – ఒక స్పూను
  5. కరివేపాకులు – ఒక కప్పు
  6. ఎండు మిర్చి – తొమ్మిది
  7. వెల్లుల్లి రెబ్బలు – అయిదు
  8. ఉప్పు – రుచికి సరిపడా
  9. నూనె – మూడు స్పూన్లు
  10. నెయ్యి – ఒక స్పూను
  11. చింత పండు – చిన్న నిమ్మకాయ సైజులో

నల్లకారం పొడి రెసిపీ:

  1. స్టవ్ మీద పాన్ పెట్టి అర స్పూను నూనె వేయాలి. అందులో జీలకర్ర వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే పాన్ లో అరస్పూను నూనె వేయాలి. అందులో శెనగపప్పు, నల్ల మినుములు వేసి వేయించాలి. అలాగే ఎండు మిర్చి కూడా వేసి వేయించాలి.
  3. అందులోనే ధనియాలు వేసి వేయించుకోవాలి.
  4. చివరలో కరివేపాకులు వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి.
  5. అన్నీ చల్లారాక వాటిని మిక్సీలో వేయాలి. చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును వేసి పొడిలా చేసుకోవాలి.
  6. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేయాలి. మంట చిన్నగా పెట్టాలి.
  7. ఆ నెయ్యిలో మిక్సీలో ఉన్నా పొడిని వేసి ఒక నిమిషం పాటూ వేయించాలి. స్టవ్ ఆఫ్ చేయాలి
  8. తరువాత ఒక ప్లేటులో ఆ పొడిని వేసి చల్లార్చాలి.
  9. ఈ పొడిని ఒక డబ్బాలో వేసి మూత పెట్టి దాచుకోవాలి. ఇది కొన్ని నెలల పాటూ నిల్వ ఉంటుంది.

ఈ పొడి నుంచి నెయ్యి వాసన వస్తుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి ఇడ్లీ పై నల్లకారంపొడి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. దోసెలపై కూడా ఈ పొడిని వేసుకుని తింటే బావుంటుంది. నల్లకారం పొడితో చట్నీ లేకుండా ఇడ్లీని తినేయచ్చు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.