Home » బిర్యానీ మసాలా ను ఇంట్లో ఇలా సులభంగా తయారుచేసుకోండి

బిర్యానీ మసాలా ను ఇంట్లో ఇలా సులభంగా తయారుచేసుకోండి

by Nikitha Kavali
0 comment

మన దేశం లో ఎవరినైనా ప్రియమైన వంటకం ఏంటి అని అడిగితే కచ్చితంగా బిర్యానీ అనే అంటారు. బిర్యానీ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లు వస్తాయి. మనం బిర్యానీ ని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రతి సారి పర్ఫెక్ట్ రుచి అనేది రాదు ఒక్కోసారి ఏదో ఒక మసాలా తక్కువ అవుతూ ఉంటుంది. ఆలా కాకుండా ఎప్పుడు బిర్యానీ చేసిన పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఈ బిర్యానీ మసాలాను వాడాల్సిందే. ఇంట్లో ఉండే బిర్యానీ సామాగ్రి తోనే ఈ బిర్యానీ మసాలాను తయారు చేసేసుకోవచ్చు.

కావలసినవి:

బిర్యానీ ఆకులు: 4 లేదా 5 ఆకులు

యాలకులు: 2 టేబుల్ స్పూన్లు

జీలకర్ర: 2 టేబుల్ స్పూన్లు

సోంపు: 1 టేబుల్ స్పూన్

లవంగాలు: 1 టేబుల్ స్పూన్

మిరియాలు: 1 టేబుల్ స్పూన్

జాపత్రి: 4 రెమ్మలు

అనాస పువ్వులు: 3-4

దాల్చిన చెక్క: పెదవి 2

నల్ల యాలకులు: 5 లేదా 6

జాజి కాయ: 2 (చిన్న ముక్కలుగా చేసినవి)

ఎండు మిర్చి:  9 లేదా 10

తయారీ విధానం:

ముందుగా ఒక బాండలి తీసుకొని కొద్దిగా వేడి చేయండి. ఇప్పుడు అది వేడి అయినా తరువాత బిర్యానీ ఆకులు, యాలకులు, జీలకర్ర, సోంపు, లవంగాలు, మిరియాలు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, జాజి కాయలు, ఎండు మిర్చి, అన్ని పైన చెప్పిన మోతాదు లో తీసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు అవి బాగా వేయించిన తరువాత పక్కకు తీసి పెట్టి చల్లార్చండి. ఇప్పుడు అవి చల్లారాక కొన్ని ఎండిన రోజా పువ్వు రెక్కలను వేసి మెత్తగా మిక్సీ కి పట్టించండి. ఇప్పుడు ఈ పొడిని తీసి, దాంట్లో కి కొంచెం మిరప పొడి ని వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిని ఒక గాజు డబ్బాలో గట్టిగా మూత పెట్టి నిల్వ చేస్తే  9 నుంచి 12  నెలల వరకు ఉంటుంది. ఇంతే అండి ఇక మీకు ఎప్పుడు బిర్యానీ కావాలి అన్న ఈ మసాలాను వాడి ఎంతో రుచికరంగా బిర్యానీ చేసేయొచ్చు. 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వంటలు వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment