Home » వెజ్‌మోమోస్ టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారీ విధానం

వెజ్‌మోమోస్ టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారీ విధానం

by TeluguRead
Momos making at home

వెజ్‌మోమోస్|  నాలుగు మాటలు:

ఇప్పుడు ఎక్కువగా  హోటల్స్‌లో కనిపిస్తున్న వెరైటీ వంటకం మోమోస్ దానితోపాటు ప్రస్తుతం ట్రేండింగ్ లో వుంటూ అందరిని ఆకర్షసిస్తుంది. ఇది టిబెటన్ ఆథంటిక్ వంటకం. నేపాల్ తో పాటు మన దేశంలోని లడక్, సిక్కిం ప్రాంతంలోనూ మోమోస్ కనిపిస్తుంటాయి. ఇక ఈ మోమోస్ వెజ్ మోమోస్, పనీర్ మోమోస్, మష్రూమ్ మోమోస్, చికెన్ మోమోస్ ఇలా చాలా వెరైటీలే ఉన్నాయి. ఈరోజు వెజ్ మోమోస్ తయారీ గురించి తేలుకుందాం.. మోమోస్ ను మూడు స్టెప్స్ ల్లో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కనుక మోమోస్ తయారీని మూడు భాగాలుగా విడదీసుకుందాం..

Momos making at home

మొదటి భాగం 1: మోమోస్ ఫిల్లింగ్

ఫిల్లింగ్ కోసం ఓ పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, ఓ పెద్ద ఉల్లిపాయ, ఓ చిన్న కాబేజీ, రెండుమూడు కారెట్లు, పచ్చి బఠాణి, తీసుకోవాలి. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఓ చెంచాడు మిరియాలపొడి కూడా తీసుకోవాలి.(ఇష్టమైనవారు బీన్స్ వంటి కూరగాయలను కూడా వేసుకోవచ్చు). తర్వాత స్టౌ పై బాణలి పెట్టి.. వేయించడానికి సరిపడా నూనెవేసి .. సన్నగా తరుక్కున్న పచ్చి బఠానీ , బీన్స్ లను వేసుకుని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత వరసగా అల్లం, వెల్లుల్లి ముక్కలూ, ఉల్లి ముక్కలూ, కారెట్, కాబేజీ తరగూ వేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు పొయ్యమీద మగ్గనివ్వాలి. తర్వాత ఈ కూరగాయల మిశ్రమంలో తగినంత ఉప్పూ, కొద్దిగా సోయాసాస్, ఓ చెంచాడు, మిరియాల పొడీ వేసి ఓసారి కలియబెట్టి అప్పుడు స్టౌ మీద నుంచి దింపెయ్యాలి. ఈ మిశ్రమం కనీసం 20 నిమిషాల పాటు చల్లారాలి.

రెండవ భాగం 2: లేయర్ ప్రిపరేషన్

ఒక కప్పు మైదా తీసుకుని కొంచెం వేడి నూనె వేసుకుని.. పూరి పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఆ పిండిని 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానిన పిండిని పూరీలకు చేసే ముద్దలా చిన్న సైజు ఉండలుగా చేసుకుని కొద్దిగా పొడి పిండి జల్లి పూరీలను బల్లమీద వీలున్నంత పలచగా ఒత్తుకోవాలి.

మూడవ భాగం 3: మోమో తయారీ

ఒక్కో పూరీ ఉండనూ పలుచగా ఒత్తుకున్నాక మధ్య భాగంలో ఫిల్లింగ్ ను సుమారు ఒక చెంచాడు పెట్టి, పూరి అంచులకు కొద్దిగా తడి రాసి అంచులను ఫిల్లింగ్ బయటకు రాకుండా మనకు షేప్స్ లో దగ్గరగా చేర్చుకుని ఒత్తుకోవాలి. తర్వాత వాటిని ఇప్పుడు వీటిని మోమో స్టాండ్ లో కానీ పెట్టుకోవాలి.. ఒకవేళ మోమోస్ స్టాండ్ లేనివారు ఇడ్లీ పాత్రలో పెట్టుకుని అచ్ఛం ఇడ్లీలు ఉడికించుకున్నట్లు ఉడికించుకోవాలి. అయితే ఇడ్లీ పాత్రలో రేకులకు మోమోలు అతుక్కోకుండా కొంచెం నూనె రాసుకోవాలి.. తర్వాత మోమోస్ లు పాత్ర రేకుల్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. అంతే వేడివేడి వెజ్ మోమోలు రెడీ. వీటిని వేడిగా ఉండగానే హాట్ హాట్ గా ముందుగా మనం తయారు చేసుకున్న  చెట్నీ తో తింటే ఎంతో బావుంటాయి.

మోమోస్  చెట్నీ తయారీ విధానం:

కావలసిన పదార్ధాలు:

ఎండు మిర్చి: 20-25

 రెడ్ చిల్లీ ఫ్లేక్స్ : 1tbsp

 వెల్లుల్లి రెబ్బలు: 8-20

 అల్లంపేస్ట్: 1/2tsp

 టమోటో: 1(ముక్కలుగా కట్ చేసుకోవాలి)

 నిమ్మరసం: 1tbsp

 ఆలివ్ ఆయిల్: 1tsp

 ఉప్పు: రుచికి సరిపడా

 కొత్తిమీర : కొద్దిగా

తయారీ విధానం:

 ముందుగా ఎండు మిర్చిని వేడినీళ్ళలో వేసి మొత్తగా అయినతర్వాత వాటిని తీసిన పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టుకొన్న ఎండుమిర్చి, మరియు పైన చెప్పిన పదార్థాలన్నీ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీకు తినే కారంను బట్టి, ఎండు మిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీని పోపు దినుసులతో పోపు పెట్టుకొని మమూస్ లేదా ఇడ్లీ , ఛాట్ వంటి వాటికి బెస్ట్ కాంబినేషన్ గా తినవచ్చు. అంతే స్పైసీ రెడ్ చట్నీ రెడీ…

మరిన్ని వంటకాల గురించి తెలుసుకోవడానికి తెలుగు రీడర్స్ ని సందర్శించండి .

You may also like

Leave a Comment