Home » నందనందనా నందనందనా – ది ఫ్యామిలీ స్టార్

నందనందనా నందనందనా – ది ఫ్యామిలీ స్టార్

by Haseena SK
0 comment

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో

హృదయాన్ని గిచ్చి గిచ్చకా
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
చిత్రంగా చెక్కింది దేనికో

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

నందనందనా
నందనందనా
నందనందనా

అడిగి అడగకా అడుగుతున్నదే ఆ ఆ
అడిగి అడగకా అడుగుతున్నదే
అలిగి అలగకా తొలగుతున్నదే
కలత నిదురలు కుదుటపడనిదే
కలలనొదలక వెనకపడతదే

కమ్ముతున్నాదే మాయలా
కమ్ముతున్నాదే టాం టాం టాం

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

సిరుల వధువుగా ఎదుట నించుందే
సిరుల వధువుగా ఎదుట నించుందే
విరుల ధనువుగా ఎదని వంచిందే
గగనమవతలి దివిని విడిచిలా
గడపకివతల నడిచి మురిసెనే

ఇంతకన్నానా జన్మకీ
ఇంతకన్నానా

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment