Home » ఎక్కడ ఎక్కడ ఉందో తారకా సాంగ్ లిరిక్స్ – మురారి

ఎక్కడ ఎక్కడ ఉందో తారకా సాంగ్ లిరిక్స్ – మురారి

by Vinod G
0 comments
ekkada ekkada vundo tharaka song lyrics murari

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా

నా కోసమే తలుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నదీ
నా చూపులో మెరుస్తున్నదీ

ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా

కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులూ
పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలూ

పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులూ
పరుగులో ఆ అడుగులు గోదారిలో వరదలూ

నా గుండెలో.. అదో మాదిరీ
నింపెయ్యకే.. సుధా మాధురీ
నా కళ్లలో.. కలల పందిరీ
అల్లేయకోయి మహా పోకిరీ

మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగింది
సిగ్గల్లే తాకిందీ బుగ్గల్లో పాకిందీ

ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా

ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ

మెరుపునీ తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియనీ

ఎన్నాళిలా తనొస్తాడనీ చూడలట ప్రతీ దారినీ
ఏ తోటలో తనుందోననీ ఎటూ పంపనూ నా మనసునీ

ఏనాడు ఒంటరిగా కంగారే ఎరుగనుగా
ఔనన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా

పూవానగా కురుస్తున్నదీ
నా చూపులో మెరుస్తున్నదీ
నా కోసమే తలుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో

కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా


చిత్రం: మురారి
గాయకులు: S.P.చరణ్, హరిణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: కృష్ణ వంశీ
తారాగణం: మహేష్ బాబు, సోనాలి బింద్రే తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.