Home » పువ్వుల్లో దాగున్న- జీన్స్

పువ్వుల్లో దాగున్న- జీన్స్

by Hari Priya Alluru
0 comment

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

 ఆ సీతాకోక చిలుక వొళ్ళెంతో అతిశయం

 వేణువులో గాలి సంగీతాలే అతిశయం

 గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం

 అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం

ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు 

ముందున్న ప్రేమేగా అతిశయం ఓ

 పదహారు ప్రయాణ పరువంలో అందరికి

 పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ

 పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం 

ఆ సీతాకోక చిలుక వొళ్ళెంతో అతిశయం

 వేణువులో గాలి సంగీతాలే అతిశయం

 గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం

 అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం 

ఏ వాసనలేని కొమ్మలపై 

సువాసన కలిగిన పూలున్నాయి 

పూలవాసనతిశయమే

 ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో 

ఒక చిటికెడైన ఉప్పుందా 

వాన నీరు అతిశయమే 

విద్యుత్తే లేకుండా వ్రేలాడే దీపాల్లా 

వెలిగేటి మిణుగురులాతిశయమే 

తనువును ప్రాణం ఏ చోటనున్నదో

 ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో 

ఆలోచిస్తే అతిశయమే 

ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు

 ముందున్న ప్రేమేగా అతిశయం ఓ

 పదహారు ప్రయాణ పరువంలో అందరికి

 పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ

 పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

 ఆ సీతాకోక చిలుక వొళ్ళెంతో అతిశయం

 వేణువులో గాలి సంగీతాలే అతిశయం

 గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం

 అతిశయమే అచ్చెరువొందే నీవే న అతిశయం

 ఆలా వెన్నెలంటి ఒక దీవి

 ఇరు కాళ్ళంట నడిచొచ్చే

 నీవే నా అతిశయమే

 జగమున అతిశయాలు యేడేనా

 ఓ మాట్లాడే పువ్వాను

 ఎనిమిదవ అతిశయమే

నింగి లాంటి నీ కళ్ళు

 పాలుగారే చెక్కిళ్ళు

 తేనెలూరే ఆధారాలు అతిశయమే

 మగువ చేతి వేళ్ళు అతిశయమే

 మకుటాలాంటి గోళ్లు అతిశయమే 

కదిలే వంపులు అతిశయమే 

ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు

 ముందున్న ప్రేమేగా అతిశయం ఓ 

పదహారు ప్రయాణ పరువంలో అందరికి 

పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ

 పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

 ఆ సీతాకోక చిలుక వొళ్ళెంతో అతిశయం

 వేణువులో గాలి సంగీతాలే అతిశయం

 గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం

 అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం…

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment