అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా

ఉన్న నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా

ఎం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ

ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ

అల్లుకొమ్మని గిల్లుతున్నది చలచల్లని గాలి

తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి

ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమాయె వేళా

అః జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా

ఉన్న నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా

ఎం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

కంటి రెప్పలా చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ

కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ

చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం

జంట మధ్యన సన్నజాజులు ఆహా కారం

మల్లి మల్లి మల్లి మల్లి ఈ రోజు రమ్మన్నా రాదేమో

నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా

ఉన్న నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా

ఎం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక..

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published