nijame ne chbuthunna jane janaa song lyris ooru peru bhairavakona

నిజమే నే చెబుతున్న జానే జానా – ఊరి పేరు భైరవ కోన

by Kusuma Putturu

తానానే నానానే నానానేనా

తానానే నానానేనే

తానానే నానానే నానానేనా

తారారే రారారరే

నిజమే నే చెబుతున్న జానే జానా

నిన్నే నే ప్రేమిస్తున్న

నిజమే నే చెబుతున్న ఏదేమైనా

నా ప్రాణం నీదంటున్న

వెళ్లకే వదిలెళ్ళకే

నా గుండెని దొచేసిలా

చల్లకే వెదజల్లకే

నా చుట్టూ రంగుల్నిలా

తానారే రారారె రారారెనా

తారారె నానారెరే

తానారే నానారె తానారెనా

తారారే రారారరే

వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే

నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే

మౌనం తెలుసే నాకు మాట తెలుసే

మౌనంలో దాగుండె మాటలు తెలుసే

కన్నుల్తో చూసేది కొంచమే

గుండెల్లో లోతే కనిపించెనే

పైపైన రూపాలు కాదులే

లోలోపలి ప్రేమే చూడాలిలే

నిజమే నే చెబుతున్న జానే జాన

నిన్నే నే ప్రేమిస్తున్నా

నిజమే నే చెబుతున్న ఏదేమైనా

నా ప్రాణం నీదంటున్న

పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా

మనసారా ఓ సైగే చాలంటున్న

అడుగులతోటి దూరం కొలిచేకన్నా

దూరాన్ని గుర్తించని పయణంకానా

నీడల్లే వస్తానే నీ జతై

తోడల్లే ఉంటానే నీ కథై

ఓ ఇనుప పలకంటి గుండెపై

కవితల్ని రాసావు దేవతై

నిజమే నే చెబుతున్న జానే జాన

నిన్నే నే ప్రేమిస్తున్నా

నిజమే నే చెబుతున్న ఏదేమైనా

నా ప్రాణం నీదంటున్న ఆ హా హా.

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like