Home » విక్టరీ వెంకటేష్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు

విక్టరీ వెంకటేష్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు

by Shalini D
257 views
Two heroines in Victory Venkatesh's new movie

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ప్రియురాలిగా మీనాక్షి కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు జరగనుంది. వెంకీ మామ, డైరెక్టర్ అనిల్ కలిసి ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు కామెడీ, యాక్షన్ చిత్రాలతో అలరించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు డిఫరెంట్ జోనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సమాచారాల కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.