Home » జై హనుమాన్ మూవీ OTT ప్లాటుఫార్మ్

జై హనుమాన్ మూవీ OTT ప్లాటుఫార్మ్

by Nikitha Kavali
542 views

ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో వచ్చిన సినిమా హనుమాన్. ఈ సినిమా జనవరి 12 2024 లో విడుదల అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకి జాతీయ స్థాయి లో ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయి ప్రధాన నటులు గా నటించారు. హనుమాన్ సినిమా దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నటీనటుల ప్రదర్శన, సంగీతం, VFX, ప్రతి ఒక దాంట్లో గొప్పగా ప్రదర్శించింది.

40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 250కోట్ల లాభాన్ని తెచ్చింది. ఈ హనుమాన్ సినిమాని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అయినా PVCU లో భాగంగా మొదట విడుదల అయినా చిత్రం. PVCU లో హనుమన్ తర్వాత జై హనుమాన్, అధీర, మహాకాళి చిత్రాలు వరుసలో ఉన్నాయి. PVCU లో తర్వాత వచ్చే సినిమా జై హనుమాన్, హనుమాన్ సినిమా కి సీక్వెల్ గా ఈ సినిమా విడుదల అవుతుంది.

జై హనుమాన్ సినిమాలో హనుమంతుని పాత్రలో కన్నడ నటుడు మరియు దర్శకుడు అయినా రిషబ్ శెట్టి కనిపించనున్నారు. జై హనుమాన్ సినిమాని హనుమాన్ చిత్రాన్ని విడుదల చేసిన రోజునే అయినా జనువారి 12, 2025 లో విడుదల చేస్తాము అని చిత్ర బృందం తెలిపారు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ OTT ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.