73
రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న SSMB29 సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది ముందుగా 2024 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే, తెలిసిన కారణాల వల్ల అది ఇప్పుడు వాయిదా పడింది. నివేదికల ప్రకారం, ‘SSMB 29’ ఆగస్టు లేదా సెప్టెంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం HYDలో అనేక రకాల సెట్ వర్క్‌లు ప్రారంభించినట్లు సమాచారం. సెప్టెంబర్‌లో మూవీ షూటింగ్ ప్రారంభించేలా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నటీనటుల ఎంపికపై రాజమౌళి ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తారని టాక్.
మరిన్ని సమాచారాల కోసంతెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.