Home » 6 కొట్టి గెలిపించిన హర్భజన్..వరల్డ్ ఛాంపియన్షిప్ అఫ్ లెజెండ్స్ లో ఇండియా శుభారంభం

6 కొట్టి గెలిపించిన హర్భజన్..వరల్డ్ ఛాంపియన్షిప్ అఫ్ లెజెండ్స్ లో ఇండియా శుభారంభం

by Vinod G
0 comments

వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియన్ ఛాంపియన్స్ శుభారంభం చేశారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఇయాన్ బెల్ 59, పటేల్ 51 హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు, కులకర్ణి, ఆర్.పి.సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

తర్వాత చేజింగ్ కు దిగిన ఇండియా 166 పరుగులు లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే చేదించింది. ఇండియా బ్యాటర్లలో రాబిన్ ఊతప్ప 32 బంతుల్లో 50 పరుగులు 4 ఫోర్లు, 2 సిక్సులతో టాప్ స్కోరర్. అలాగే గురుక్రిత్ సింగ్ 33 నమన్ ఓజా 25 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్కోఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా రవి బపోరా 2 వికెట్లు సాధించారు. ఒకానొక దశలో భారత ప్రధాన బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అవ్వగా కేవలం 7 బాల్స్ లో 6 రన్స్ కావాల్సి ఉండగా 18 ఓవర్లో చివరి బాల్ కి హర్భజన్ సింగ్ సిక్స్ కొట్టి గెలిపించారు. ఈ మ్యాచ్ యొక్క హైలెట్స్ యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.

india champions first match result in world championship of legends 2024
india champions first match result in world championship of legends 2024

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ క్రీడలుసందర్శించండి.

You may also like

Leave a Comment