Home » వరల్డ్ ఛాంపియన్స్ అఫ్ లెజెండ్స్ 2024 లీగ్.. సెమి ఫైనల్ కి చేరిన ఇండియా ఛాంపియన్స్…

వరల్డ్ ఛాంపియన్స్ అఫ్ లెజెండ్స్ 2024 లీగ్.. సెమి ఫైనల్ కి చేరిన ఇండియా ఛాంపియన్స్…

by Vinod G
411 views
senior cricketers in world championship of legends 2024

2011 వరల్డ్ కప్ మన అందరికి ఒక మధుర జ్ఞాపకం. ఎందుకంటే ప్రతి భారతీయుడి చిరకాల కల నెరవేరి, ఇండియా కప్ సొంతం చేసుకున్న వరల్డ్ కప్ అది. మళ్ళీ అప్పటి నుండి ఇండియా టైటిల్ ని గెలవలేదు. 2023 వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి కొద్దిలో టైటిల్ జారవిడుచుకుంది. అయితే 2011 ధోని సారథ్యం లో వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన చాల మంది ప్లేయర్స్ ఇప్పుడు ఇండియా టీం లో లేరు. వీరిని గ్రౌండ్ లో చూసి కూడా చాల రోజులయిపోయింది.

అయితే ఈ పాత హీరోలు క్రికెట్ అభిమానులను అలరించడానికి మళ్ళీ గ్రౌండులోకి దిగుతున్నారు. అవును యువరాజ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఉతప్ప, హర్భజన్ వంటి స్టార్లు వరల్డ్ ఛాంపియన్స్ అఫ్ లెజెండ్స్ 2024 లీగులో భాగంగా గ్రౌండ్ లోకి దిగుతున్నారు. ఈ లీగ్ లో ఇంగ్లాండ్, విండీస్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా దేశాలతో ఇండియా పోటీపడనుంది. ఈ మ్యాచ్ లలో అఫ్రిదీ, మిస్బా, బ్రెట్లీ, కల్లిస్ వంటి అలనాటి ప్రత్యర్థులను మన హీరోలు ఎదుర్కోనున్నారు. ఈ వరల్డ్ ఛాంపియన్స్ అఫ్ లెజెండ్స్ 2024 లీగ్ 3 జులై(2024) నుండి 13 జులై(2024) వరకు ఇంగ్లండ్ లో జరగనుంది. ఈ మ్యాచ్లు అన్ని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటలకు మరియు రాత్రి 9 గంటలకు స్టార్ స్పోర్ట్స్ 1 లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.

ఇండియా స్క్వాడ్: World Championship of Legends 2024 India Squad

అంబటి రాయుడు(బ్యాటర్), గురుకీరత్ సింగ్ మాన్(బ్యాటర్), సౌరభ్ తివారీ(బ్యాటర్), సురేష్ రైనా(బ్యాటర్), ఇర్ఫాన్ పఠాన్(బౌలింగ్ ఆల్‌రౌండర్), యూసుఫ్ పఠాన్(బ్యాటింగ్ ఆల్‌రౌండర్), యువరాజ్ సింగ్(బ్యాటింగ్ ఆల్‌రౌండర్), నమన్ ఓజా(WK-బ్యాటర్), రాబిన్ ఉతప్ప(WK-బ్యాటర్), అనురీత్ సింగ్(బౌలర్), ధావల్ కులకర్ణి(బౌలర్), హర్భజన్ సింగ్(బౌలర్), పవన్ నేగి(బౌలింగ్ ఆల్‌రౌండర్), రాహుల్ శర్మ(బౌలర్), రాహుల్ శుక్లా(బౌలర్), ఆర్పీ సింగ్(బౌలర్), వినయ్ కుమార్(బౌలర్)

మ్యాచ్స్ షెడ్యూల్: World Championship of Legends 2024 Schedule

తేదీ మ్యాచ్ వేదిక సమయం(భారత కాలమానం ప్రకారం)ఫలితం
జూలై 03, బుధవారంఇంగ్లండ్ ఛాంపియన్స్ vs ఇండియా ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్సాయంత్రం 5 గంటలుఇండియా ఛాంపియన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది
జూలై 03, బుధవారంఆస్ట్రేలియా ఛాంపియన్స్ vs పాకిస్థాన్ ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్రాత్రి 9 గంటలకిపాకిస్థాన్ ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది
జూలై 04, గురువారంసౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ vs ఇంగ్లండ్ ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్సాయంత్రం 5 గంటలుఇంగ్లండ్ ఛాంపియన్స్ 9వికెట్ల తేడాతో విజయం సాధించింది
జూలై 04, గురువారంపాకిస్థాన్ ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్రాత్రి 9 గంటలకిపాకిస్థాన్ ఛాంపియన్స్ 29 రన్స్ తేడాతో విజయం సాధించింది
జూలై 05, శుక్రవారంఆస్ట్రేలియా ఛాంపియన్స్ vs సౌతాఫ్రికా ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్సాయంత్రం 5 గంటలుఆస్ట్రేలియా ఛాంపియన్స్ 101 రన్స్ తేడాతో విజయం సాధించింది
జూలై 05, శుక్రవారంఇండియా ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్రాత్రి 9 గంటలకిఇండియా ఛాంపియన్స్ 27 రన్స్ తేడాతో విజయం సాధించింది(డి ల్ స్ మెథడ్)
జూలై 06, శనివారంఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్సాయంత్రం 5 గంటలుఆస్ట్రేలియా ఛాంపియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది
జూలై 06, శనివారంఇండియా ఛాంపియన్స్ vs పాకిస్థాన్ ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్రాత్రి 9 గంటలకిపాకిస్థాన్ ఛాంపియన్స్ 68 రన్స్ తేడాతో విజయం సాధించింది
జూలై 07, ఆదివారందక్షిణాఫ్రికా ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్సాయంత్రం 5 గంటలువెస్టిండీస్ ఛాంపియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది
జూలై 07, ఆదివారంఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs పాకిస్థాన్ ఛాంపియన్స్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్రాత్రి 9 గంటలకిపాకిస్థాన్ ఛాంపియన్స్ 79 రన్స్ తేడాతో విజయం సాధించింది
జూలై 08, సోమవారంఇండియా ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్రాత్రి 9 గంటలకిఆస్ట్రేలియా ఛాంపియన్స్ 23 రన్స్ తేడాతో విజయం సాధించింది
జూలై 09, మంగళవారంవెస్టిండీస్ ఛాంపియన్స్ vs ఇంగ్లండ్ ఛాంపియన్స్కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్సాయంత్రం 5 గంటలువెస్టిండీస్ ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది
జూలై 09, మంగళవారందక్షిణాఫ్రికా ఛాంపియన్స్ vs పాకిస్థాన్ ఛాంపియన్స్కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్రాత్రి 9 గంటలకిదక్షిణాఫ్రికా ఛాంపియన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది
జూలై 10, బుధవారంవెస్టిండీస్ ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్సాయంత్రం 5 గంటలుఆస్ట్రేలియా ఛాంపియన్స్ 55 రన్స్ తేడాతో విజయం సాధించింది
జూలై 10, బుధవారంఇండియా ఛాంపియన్స్ vs సౌతాఫ్రికా ఛాంపియన్స్కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్రాత్రి 9 గంటలకిసౌతాఫ్రికా ఛాంపియన్స్ 54 రన్స్ తేడాతో విజయం సాధించింది
జూలై 12, శుక్రవారంపాకిస్థాన్ ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్
సెమీ ఫైనల్ – 1
కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్సాయంత్రం 5 గంటలు
జూలై 12, శుక్రవారంఆస్ట్రేలియా ఛాంపియన్స్ vs ఇండియా ఛాంపియన్స్
సెమీ ఫైనల్ – 2
కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్రాత్రి 9 గంటలకి
జూలై 13, శనివారంTBC vs TBC, ఫైనల్ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్రాత్రి 9 గంటలకి

పాయింట్స్ టేబుల్: World Championship of Legends 2024 – Points Table

టీమ్స్ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లుగెలిచినవి ఓడినవి ఫలితం తేలనవి(టై)పాయింట్స్నెట్ రన్ రేట్
ఇండియా ఛాంపియన్స్(Q)42404-0.826
పాకిస్థాన్ ఛాంపియన్స్(Q)54108+1.644
వెస్టిండీస్ ఛాంపియన్స్(Q)42204-0.640
సౌతాఫ్రికా ఛాంపియన్స్(E)52304-1.340
ఆస్ట్రేలియా ఛాంపియన్స్(Q)54108+2.464
ఇంగ్లండ్ ఛాంపియన్స్(E)51402-0.746

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ క్రీడలు సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.