Home » సలార్-2 సినిమా షూటింగ్ ఆగస్టు 10 నుంచి మొదలు?

సలార్-2 సినిమా షూటింగ్ ఆగస్టు 10 నుంచి మొదలు?

by Shalini D
307 views
Salaar-2 movie shooting to start from August 10

‘కల్కి 2898AD’ సూపర్‌హిట్‌తో జోరుమీదున్న ప్రభాస్ తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్-2(శౌర్యాంగపర్వ) షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. AUG 10 నుంచి దాదాపు 15 రోజులపాటు షెడ్యూల్ సాగుతుందని తెలుస్తోంది. ప్రభాస్, పృథ్వీరాజ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారని టాక్. గతేడాది విడుదలైన సలార్ మూవీ మంచి కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.

ఇక సలార్- 2 సినిమా షూటింగ్​ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే మొదలుపెట్టనున్నారట. 10 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు, ఇందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తర్వాత సన్నివేశాలను బెంగళూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట.

అసలైన కథ మొదలయ్యే పార్ట్ 2లో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య పోరాట సన్నివేశాలు ఉండనున్నాయి. ఎన్నో సస్పెన్స్​లతో ముగించిన సలార్ పార్ట్-1కు ఈ సీక్వెల్​లో సమాధానాలు దొరకున్నాయని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

మరిన్ని సమాచారాల కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.