ఏదారెదురవుతున్న ఎటువెళుతుందో అడిగానా
ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న
ఎం చూస్తూ ఉన్న నే వెతికాన ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న
కదలని ఓ శిలనే ఐన
తృటిలో కరిగే కలనీ ఐన
ఎం తేడా ఉందట
నువెవ్వరంటూ అడిగితే నన్నెవరైనా
ఇలాగే కడదాకా
ఓ ప్రశ్నకి ఉంటానంటున్న
ఏదో ఒక బధులై
నను చేరపొద్దని కలనడుగుతూ ఉన్న
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
తన వెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నా యధా లయను కుసలం అడిగిన
గుస గుస కబురులు
గుమ గుమ లెవరివి
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనధ
అనగనగ అంటూ నే ఉంటా
ఎపుడు పూర్తవనే అవక
తుది లేని కత నేనుగా
గాలి వాటాం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏచ్చోట నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివానవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
తన వెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నా యధా లయను కుసలం అడిగిన
గుస గుస కబురులు
గుమ గుమ లెవరివి
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్న విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ వొడిలో మొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిలీ అంత దూరాన ఉన్న
వెన్నెలగా చంతనే ఉన్న
అంటూ ఊయలలోపింది జోలాలి
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.