నీ చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు తిరిగినా
నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

ఓ దమ్ము లాగి గుమ్మతో
రిథమ్ము కలిపి ఆడమందిగా
ప్రాణమే పతంగిలాగ ఎగురుతోందిగా
ఇంతలో తతంగమంత మారుతోందిగా

క్షణాలలో ఇదేమిటో
గల్లంతు చేసే ముంతకళ్ళు లాంటి
కళ్ళలోన తేలగా
మరింత ప్రేమ పుట్టుకొచ్చి
మత్తులోకి దించుతోందిగా

నీ చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు తిరిగినా
నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

మీసాలనే తిప్పమాకు బాబో
వేషాలతో కొట్టమాకు డాబో
నువ్వింత పొగుడుతున్న
నేను పడనే పడనుగా
చటుక్కునొచ్చె ప్రేమ
నమ్మలేను సడనుగా

కంగారుగా కలగనేయ కైపు
నేనస్సలే కాదు నీ టైపు
ఇలాంటివెన్ని చూడలేదు
కళ్ళ ముందరా
నువ్వెంత గింజుకున్న
నన్ను గుంజలేవురా

ఏమిటో అయోమయంగ ఉంది నా గతి
ముంచినా భలేగా ఉంది ఈ పరిస్థితి
ఇదో రకం అరాచకం
కరెంటు షాకు లాంటి వైబ్
నీది అంటే డౌటే లేదు
ఖల్లాసు చేసి పోయినావు
ఓరచూపు గుచ్చి నేరుగా

నీ చుట్టు చుట్టు చుట్టుతిరిగినా
నా చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా
ఓ దమ్ము లాగి గుమ్మతో
రిథమ్ము కలిపి ఆడమందిగా

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published